Lunar Eclipse 2022: 15 రోజుల్లో రానున్న చంద్రగ్రహణం... ఇది భారతదేశంలో కనిపించనుందా?

Lunar Eclipse 2022: చంద్రగ్రహణం మరో 15 రోజుల్లో రానుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఇదే.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 12:00 PM IST
Lunar Eclipse 2022: 15 రోజుల్లో రానున్న చంద్రగ్రహణం... ఇది భారతదేశంలో కనిపించనుందా?

Lunar Eclipse 2022 Date and Time in India: ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం (Solar Eclipse 2022) ఏప్రిల్ 30న సంభవించింది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. మే16,2022న చంద్రగ్రహణం (Lunar Eclipse 2022) ఏర్పడనుంది. ఈ సంవత్సరం మొత్తం 4 గ్రహణాలు ఉన్నాయి, వాటిలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు. ఈ సూర్యగ్రహణాలలో ఒకటి సంభవించింది, ఇది పాక్షిక సూర్యగ్రహణం. అయితే మే 16న ఏర్పడే చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది. ఈ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారిపై పెను ప్రభావం చూపుతుంది. ఇటీవలె ఏర్పడిన సూర్యగ్రహణం మన దేశంలో  కనిపించలేదు. రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. 

చంద్ర గ్రహణ సమయం
చంద్రగ్రహణం.. మే 16వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. ఈ గ్రహణం వృషభరాశిలో ఏర్పడుతుంది. అయితే ఇది అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహణం తరువాత, తప్పనిసరిగా స్నానం, దానధర్మాలు చేయాలి. తద్వారా గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు. ఈ గ్రహణం నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మరియు అంటార్కిటికాలో కనిపిస్తుంది.

నవంబర్‌లో చివరి చంద్రగ్రహణం
ఈ సంవత్సరం రెండవ మరియు చివరి చంద్ర గ్రహణం 8 నవంబర్ 2022 న జరుగుతుంది. ఈ గ్రహణం సాయంత్రం 05:28 నుండి 07:26 వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించనుంది. హిందూమతం, జ్యోతిషశాస్త్రం ప్రకారం...గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. ఇందులో ముఖ్యంగా గ్రహణ సమయంలో తినడం, త్రాగడం, గుడి తలుపులు తెరిచి ఉంచడం, గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులను ఉపయోగించడాన్ని నిషేధించడం వంటివి ఉన్నాయి. 

Also Read: Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మంచిది..ఆ సమయంలోనే బంగారం ఎందుకు కొనాలి..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News