Wisdom Teeth Pain: ఈ 4 ఇంటి చిట్కాలతో జ్ఞాన దంతాల నొప్పి నుండి ఉపశమనం పొందండి!

Wisdom Teeth Pain Relief: జ్ఞాన దంతాల నొప్పి చాలా బాధాకరమైనది. మీరు దానిని నుండి త్వరగా ఉపశమనం పొందాలంటే.. ఇంట్లో ఉన్న ఈ రెమిడీస్ ను ఉపయోగించండి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 11:34 AM IST
Wisdom Teeth Pain: ఈ 4 ఇంటి చిట్కాలతో జ్ఞాన దంతాల నొప్పి నుండి ఉపశమనం పొందండి!

Wisdom Teeth Pain Home Remedies:  నోటి మూలలో ఉండే జ్ఞాన దంతాలు పెద్దవి అయినప్పుడు, నొప్పి పెరగడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఈ నొప్పి (Wisdom Teeth Pain) చాలా ఎక్కువ అవుతుంది. దీని వల్ల చిగుళ్ళు ఉబ్బడం ప్రారంభిస్తాయి, కొన్నిసార్లు రక్తం కూడా వస్తుంది. అటువంటి పరిస్థితిలో, దంతాలను పూర్తిగా తొలగించడమే ఏకైక పరిష్కారం. కానీ మీకు సమీపంలో డెంటల్ క్లినిక్ లేకుంటే... నొప్పి నుండి తక్షణమే ఉపశమనం పొందాలనుకుంటే, మీరు కొన్ని ఇంటి నివారణలు వాడండి. 

1. ఉప్పు 
ఉప్పు (Salt) దంతాలకు అద్భుతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. జ్ఞాన దంతాల  నొప్పి భరించలేనప్పుడు, ఉప్పు నీటితో పుక్కిలించండి. ఇది వెంటనే నొప్పిని తగ్గిస్తుంది. 

2. ఐస్ క్రీమ్ 
జ్ఞాన దంతాల్లో నొప్పి వస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ తినండి లేదా ఆ ప్రాంతంలో ఐస్ ముక్కలను పెట్టుకోండి. ఇది నొప్పిని నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. 

3. లవంగం నూనె
లవంగాలు.. నోటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి. నొప్పి లేదా వాపు ఉన్నప్పుడు లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. జ్ఞాన దంతాల సమస్య కోసం, లవంగం నూనెను (Clove oil) కాటన్ ప్యాడ్ లేదా దూదితో రాయండి. ఇది నొప్పి మరియు వాపు రెండింటినీ తొలగిస్తుంది. 

4. పసుపు
పసుపులో (Turmeric) యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున ఇది అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పరిగణింపబడుతుంది. జ్ఞాన దంతాల నొప్పిని తొలగించడానికి, పసుపు ఉప్పు, ఆవపిండిని కలిపి పేస్ట్ సిద్ధం చేయండి. తర్వాత ఈ పేస్ట్ గొంతులోకి వెళ్లంకుండా జాగ్రత్తలు తీసుకుని జ్ఞాన దంతాల మీద అప్లై చేయండి. 

Also Read: Blood Increase Food: మీరు రక్తహీనతతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలతో ఆ సమస్యకు చెక్ పెట్టండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News