HRC Complaint On Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. హైకోర్టు న్యాయవాది రామారావు హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్రిక్తతలను లేవనెత్తే ప్రయత్నాలు చేస్తోందని, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించేలా ప్రవర్తిస్తోందని తాను చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫలితంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ దీనిపై విచారణ చేపట్టనుంది.
ఈనెల 7వ తేదీన కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. తొలుత వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించనున్న రాహుల్ గాంధీ.. అదే క్రమంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అమరవీరుల కుటుంబాలతో, విద్యార్థులతో ముఖాముఖి చేపట్టేందుకు స్థానిక కాంగ్రెస్‌పార్టీ నేతలు ప్లాన్ చేశారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సభ నిర్వహించేందుకు వర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను అనుమతి కోరగా అనుమతి నిరాకరించారు. ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, యూనివర్సిటీ వీసీదే తుది నిర్ణయమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాంగ్రెస్ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ నేతలు.. ఓయూలో రాహుల్ సభను నిర్వహించి తీరతామని పట్టుబడుతున్నారు. అక్కడ ఏవైనా శాంతిభద్రతల సమస్య ఎదురైతే ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వ్యతిరేక విద్యార్థి సంఘాలు.. ముఖ్యంగా టీఆర్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం రాహుల్‌గాంధీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో, ఓయూలో గంభీర వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జాతీయ మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదయ్యింది.
Also Read: Sonu Nigam Comments: హిందీ జాతీయ భాష డైలాగ్ వార్ అంశంపై స్పందించిన గాయకుడు సోను నిగమ్..!
Also Read: Sun stroke tips: వేసవి తాపం వడదెబ్బల్నించి చిన్నారుల్ని ఎలా రక్షించడం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook