IPL 2022 Playoffs Scenario: Gujarat qualified, Lucknow almost assured: మార్చి 26న మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ అభిమానులను అలరిస్తూ వస్తోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుండడంతో మండే వేసవిలో ఫాన్స్ సల్లగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా అన్ని జట్లు (నాలుగు మినహా) 10 మ్యాచులు ఆడడంతో ఐపీఎల్ 2022 తుది అంకానికి చేరుకుంది. మరో రెండు మూడు వారాల్లో ఐపీఎల్ లీగ్ స్టేజ్ పూర్తవనుంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ చేరే జట్లేవో ఓసారి చూద్దాం.
ఐపీఎల్ 2022లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ సత్తాచాటుతున్నాయి. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ 2లో కొనసాగుతున్నాయి. గుజరాత్ ఆడిన 10 మ్యాచులలో 8 విజయాలు అందుకుని 16 పాయింట్లతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇకపై పట్టికలో అగ్రస్థానంలో ఉండేందుకే ఆ జట్టు ప్రయత్నం చేస్తుంది. మరోవైపు లక్నో 10 మ్యాచులలో 7 విజయాలు అందుకుని 14 పాయింట్లతో కొనసాగుతోంది. ఇంకో విజయం సాధిస్తే.. లక్నోకు అధికారిక ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.
రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్స్ సంపాదించింది. రాజస్థాన్ ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ చేరాలంటే.. మిగిలిన నాలుగు మ్యాచులలో రెండు గెలవాల్సి ఉంది. ఒకటి మాత్రమే గెలిస్తే.. ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచుల్లో 5 విజయాలతో 10 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మిగిలిన ఐదు మ్యాచుల్లో 3 విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది.
పదేసి మ్యాచులు ఆడి ఐదు విజయాలు అందుకున్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు కూడా ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు జట్లు మిగిలిన నాలుగు మ్యాచులలో మూడు గెలిస్తేనే అవకాశం ఉంటుంది. రెండు గెలిస్తే.. ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. 9 మ్యాచులలో నాలుగు విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. మిగిలిన ఐదింటిలో నాలుగు గెలవాల్సి ఉంది.
ఐపీఎల్ 2022లో 10 మ్యాచులు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్.. ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే మిగిలిన నాలుగింటిలో తప్పక గెలవాలి. ఇప్పటివరకు మూడు విజయాలు మాత్రమే సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. మిగిలిన ఐదింటిలో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఇది దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు. ఇక ఒకే మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే అధికారికంగా 16 పాయింట్లు తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. 14 పాయింట్స్ సాధిస్తే.. ఇతర జట్ల సమీకరణలపై ఆధారపడాల్సి ఉంటుంది.
Also Read: Kangana Ranaut Hot Pics: బాబోయ్ కంగనా రనౌత్.. ఎద అందాలు చూపిస్తూ చంపేస్తోందిగా!
Also Read: Vishwak Sen: అమ్మా.. నన్ను ఎవ్వడు ఏం పీకలేడు.. రాసిపెట్టుకో: విశ్వక్ సేన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook