Fir to file on Hero Suriya Jyothika: కోలివుడ్ స్టార్ సూర్య, జ్యోతిక దంపతులకు కొత్త చిక్కులు తప్పేలా లేవు. వారిరువురు కలిసి సొంత బ్యానర్‌పై నిర్మించిన చిత్రం జై భీమ్. టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నవంబర్‌లో అమెజాన్‌లో విడుదలైంది. పేదలకు న్యాయం చేసేందుకు తపించే లాయర్ పాత్రలో సూర్య అద్భతంగా నటించారు. వాస్తవన సంఘటనల ఆధారంపై తెరకెక్కించిన జై భీమ్.. ప్రశంసలు అందుకున్నా... కొన్ని విమర్శలను సైతం మూటగట్టుకుంది.
అందులో ప్రధానమైనది క్యాలెండర్ సీన్ వివాదం. తన కులాన్ని కించపరిచేలా క్యాలెండర్ సీన్ ఉందంటూ వన్నియార్ సంఘం నేతలు గత నవంబర్‌లో కోర్టును ఆశ్రయించారు. ఆ సీన్ తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడే సూర్య, టీజే. జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్‌కు వన్నియార్ సంఘం లీగల్ నోటీసులు పంపించింది. తమ కులాన్ని కించపరిచినందుకు 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
సినిమాలోని ఓ సన్నివేశంలో గోడకు ఉన్న క్యాలెండర్‌పై వన్నియార్ కులానికి సంబంధించిన చిహ్నం కనబడుతుంది. తమ కులాన్ని కించపరిచేందుకే అలా చూపారంటూ వన్నియార్ కులస్తులు మండిపడ్డారు. క్యాలెండర్ సీన్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ వ్యవహారం పెను దుమారానికి దారితీసింది.
మరోవైపు వన్నియార్ సంఘం పిటిషన్‌పై విచారణ జరిపిన సైదాపేట కోర్టు ... సూర్య, జ్యోతిక దంపతులతో పాటు దర్శకుడు టీజే.జ్ఞానవేల్‌పై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని చెన్నై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.
Also Read: Terrorists Plot For Bomb Blasts: దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. తెలంగాణకు ఆయుధాలు
Also Read: UIDAI Aadhaar Data: బయోమెట్రిక్ డేటా ఎవరితోనైనా షేర్ అవుతోందా, ఢిల్లీ హైకోర్టులో ఏం జరిగింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook