Leopord alert : ఎండలు మండిపోతుండటంతో ఆహారం కోసమే... నీటి కోసమో వన్య మృగాలు జనావాల్లోకి వస్తుండటం కలకలం రేపుతోంది. అలా వస్తున్న క్రూరమృగాలు .. జనాన్ని గాయపర్చడమే.. లేక జనం చేతుల్లో చావడం జరుగుతోంది. తాజాగా నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సమీపంలో చిరుత సంచరించడం కలకలం రేపింది.
పోతిరెడ్డిపాడు హెడ్ రేగులేటర్ వద్ద చిరుతపులి హల్‌చల్ చేసింది. ప్రాజెక్టు గేట్లపై కాసేపు సంచరించింది. చిరుతపులి గేట్లపైన తిరుగుతుండగా స్ధానికులు గమనించి సెల్ ఫోన్ లో వీడియోలు తీశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గేట్ల సిమెంట్ బెడ్ల నీడన చిరుతపులి సేద తీరింది.
చిరుత సంచారం గురించి తెలియడంతో ప్రాజెక్టు పక్కనే ఉన్న చాబోలు గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. కొత్తపల్లి నల్లమల అటవీ ప్రాంతం నుంచి కృష్ణానది మీదుగా చిరుతపులి వచ్చి ఉండవచ్చని స్ధానికులు భావిస్తున్నారు. చాబోలు గ్రామస్తుల సమాచారంతో చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుతపులి జాడ కోసం గాలింపు చేపట్టారు.
సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బయటకు ఒంటరిగా రావొద్దనీ.. ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే.. గుంపులు గుంపులుగా తిరగాలని సూచించారు. నిర్జన ప్రదేశాల్లోనూ, తుప్పలు, పొదలు ఎక్కువగా ఉన్న చోట చిరుత నక్కే అవకాశం ఉండటంతో అటు వైపు వెళ్లొద్దని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ బృందాలు గాలిస్తున్నాయి.
Also Read: TS SPDCL Jobs: టీఎస్ ఎస్‌పీడీసీఎల్‌లో 1270 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్
Also Read:Sri lanka PM Resign: మహిందా రాజపక్సే రాజీనామా.. నిరసనలకు దిగివచ్చిన శ్రీలంక ప్రధాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook