Wheat Prices Hiked: గోధుమల ధరలు గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కిలో గోధుమల ధర సగటున రూ. 32.38 కి పెరిగింది. 2010 జనవరి తర్వాత గోధుమల ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంటే గత పన్నెండేళ్లలో గోధుమ ధరలు ఇంత గరిష్ట స్థాయికి చేరడం ఇదే ప్రప్రథమం అన్నమాట. అయితే, ఉన్నట్టుండి గోధుమల ధరలు ఇంత భారీగా పెరగడానికి కారణం ఏంటనేదే కదా మీ సందేహం.. మరేం లేదు. ఇటీవల కాలంలో గోధుమల ఉత్పత్తి తగ్గడం ఒక కారణమైతే.. దేశంలో గోధుమల నిల్వలు తగ్గిపోవడం మరో కారణమైంది. వీటికితోడు విదేశాల్లో గోధుమలకు భారీ డిమాండ్ ఏర్పడటం ఇంకో కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అన్ని రాష్ట్రాల్లోని పౌరసరఫరాల శాఖల వద్ద నుంచి కేంద్ర ప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణి శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం మే 7న దేశవ్యాప్తంగా కిలో గోధుమ పిండి ధర రూ. 32.78 గా ఉంది. సరిగ్గా ఏడాది క్రితం ఉన్న రూ. 30.03 తో పోల్చుకుంటే ఇప్పుడున్న ధర 9.15 శాతం అధికం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 156 కేంద్రాల గణాంకాలను పరిశీలిస్తే.. మే 7న పోర్ట్ బ్లెయిర్‌లో అత్యధికంగా రూ.59 పలికింది. అలాగే అత్యల్పంగా పశ్చిమ బెంగాల్లోని పురులియాలో కిలో గోధుమ పిండి ధర రూ. 22 గా ఉంది. వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే ఉత్పత్తుల ధరలే ఆకాశాన్నంటుతున్నాయని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
2022 మార్చి నెలలో వినియోగదారుల ధర సూచికల ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్టానికి చేరి 6.95 శాతంగా నమోదైంది. దీంతో గోధుమలతో పాటు గోధుమ ఆధారిత ఆహార ఉత్పత్తుల ధరలు సైతం 15-20 శాతం పెరిగాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనైతే గోధుమల ధరలు 14 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.
గోధుమల ధరలు పెరగడానికి అనేక కారణాలు
- అంతర్జాతీయ మార్కెట్‌లో గోధుమల ధరలు భారీగా పెరగడంతో గోధుమల ఎక్స్‌పోర్ట్స్‌కి సైతం అంతే భారీగా డిమాండ్ ఏర్పడింది.
- దేశంలో గోధుమ ఉత్పత్తితో పాటు గోధుమల నిల్వలు తగ్గిపోయాయి.
- రష్యా, ఉక్రెయిన్ దేశాలు అధికంగా గోధుమ ఎగుమతులు చేసే దేశాల జాబితాలో అగ్రభాగాన ఉన్నాయి. గోధుమ ఎక్స్‌పోర్ట్స్‌లో రష్యా రెండో అతి పెద్ద దేశంగా ఉండగా.. ఉక్రెయిన్ నాలుగో స్థానంలో ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో గోధుమ రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
- గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 70 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను భారత్ విదేశాలకు ఎగుమతి చేయడంలో దేశంలో నిల్వలు తగ్గిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోధుమల ఎగుమతులు మరింత భారీ స్థాయిలో ఉంటాయనే అంచనాలు వెలువడుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ వార్ (Russia, Ukraine War) కారణంగా ప్రపంచ దేశాల్లో ఏర్పడిన కొరతే ఇందుకు ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Also read : TATA Nexon EV Max: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 300 కిమీ వెళ్లొచ్చంటున్న కంపెనీ, బుకింగ్స్ ప్రారంభం
Also read : Campus Activewear Shares: లిస్టింగ్ డే నాడే 42 శాతం పైకి ఎగిసిన క్యాంపస్ యాక్టివేర్ షేర్ ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Wheat Prices Hiked: ఆకాశాన్నంటుతున్న గోధుమ ధరలు.. కారణం ఏంటంటే..
అంతర్జాతీయ మార్కెట్లో గోధుమలకు భారీ డిమాండ్
12 ఏళ్ల గరిష్టానికి చేరిన గోధుమ ధరలు
గోధుమల ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటంటే..