IPL Updates: హర్రే... వార్నర్ తృటిలో బతికిపోయాడుగా.. బంతి వికెట్లను తాకినా బెయిల్స్ పడలేదు...

IPL Updates Rajasthan vs Delhi: రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మ్యాన్ వార్నర్‌కు అదృష్టం కలిసొచ్చింది. చాహల్ బౌలింగ్‌లో తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 12, 2022, 08:10 AM IST
  • ఐపీఎల్ లేటెస్ట్ అప్‌డేట్స్
  • రాజస్తాన్‌తో మ్యాచ్‌లో వార్నర్‌కి కలిసొచ్చిన లక్
  • చాహల్ బౌలింగ్‌లో బంతి వికెట్లను తాకినా ఔట్ అవ్వలేదు
 IPL Updates: హర్రే... వార్నర్ తృటిలో బతికిపోయాడుగా.. బంతి వికెట్లను తాకినా బెయిల్స్ పడలేదు...

IPL Updates Rajasthan vs Delhi: క్రికెట్‌లో కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్‌కు అదృష్టం భలేగా కలిసొస్తుంది. రాజస్తాన్-ఢిల్లీ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మ్యాన్ వార్నర్‌కు కూడా అదృష్టం కలిసొచ్చింది. 9వ ఓవర్‌లో యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో వార్నర్ తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుని హాఫ్ సెంచరీ బాది... ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చాహల్ బౌలింగ్‌లో వార్నర్ ఇలా బతికిపోయాడు :

యజువేంద్ర చాహల్ 9వ ఓవర్‌లో ఓ బంతిని ఆఫ్ స్టంప్ మీదుగా వేశాడు. వార్నర్ దాన్ని భారీ షాట్‌గా మలచబోయి భంగపడ్డాడు. ఇంతలో బంతి నేరుగా స్టంప్స్‌ను తాకింది. కానీ వార్నర్ అదృష్టమో... చాహల్ దురదృష్టమో... బంతి స్టంప్స్‌ను తాకినా బెయిల్స్ కింద పడలేదు. దీంతో వార్నర్ ఔటయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు. టీవీ రీప్లేలో బంతి వికెట్లను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో రెడ్ లైట్ కూడా వెలిగింది. బంతి వికెట్లను తాకినట్లే తాకి బెయిల్స్‌ను గిరాటేయకపోవడంతో చాహల్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు. వార్నర్ నవ్వులు చిందిస్తూ కనిపించాడు. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

గెలుపు ఢిల్లీదే :

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిగా రాజస్తాన్-ఢిల్లీ జట్లు తలపడ్డాయి. ఇందులో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అశ్విన్ (50), పడిక్కల్ (48) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో సకారియా, నోర్ట్జే, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి దిగిన ఢిల్లీ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18వ ఓవర్‌లోనే విజయాన్ని అందుకుంది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లో మార్ష్ 7 సిక్సులు, 5 ఫోర్లతో 89 (62),  వార్నర్ 1 సిక్స్, 5 ఫోర్లతో 52 (41) పరుగులు చేశారు. ఈ విజయంతో ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

Also Read: SVP Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సర్కారు వారి పాట'... ఇట్స్ మహేష్ వన్ మ్యాన్ షో..   

Also Read: Horoscope Today May 12 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి దగ్గరి బంధువు నుంచి శుభవార్త అందుతుంది...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News