Aata Choreographer tina died : ఆట డాన్స్‌షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కొరియోగ్రాఫర్ టీనా. ఓంకార్ హోస్ట్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఆట షో ఫస్ట్ సీజన్ విన్నర్‌గా నిలిచిన టీనా అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఆట నాలుగో సీజన్‌లో జడ్జిగానూ వ్యవహరించింది. తనదైన శైలిలో జడ్జ్‌మెంట్ ఇచ్చేది టీనా. టీనా సాధూ గోవాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. టీనా మృతిని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆమె సహచర కొరియోగ్రఫర్ సందీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
టీనాకు మంచి డాన్సర్‌గా పేరుంది. కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది టీనా. టీనా గోవాలో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే నివసిస్తోంది. ఇటీవల కొంత కాలంగా మూడ్ బాలేదని సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె గుండెపోటుతో చనిపోయిందని కుటుంబీకులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
టీనా సాధు ఆకస్మిక మరణం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. చిన్నవయసులోనే టీనా మరణించడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె మృతి పట్ల ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాలుగైదు రోజుల క్రితం టీనా హైదరాబాద్‌లో యాంకర్ శిల్పాచక్రవర్తిని కలిసిందని తెలుస్తోంది. తిరిగి డ్యాన్స్ షోల్లో రీఎంట్రీ ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత గోవా వెళ్లిపోయిన ఆమె మరణవార్త బయటికొచ్చింది. ఆమె ఎక్కువ మోతాదులో మద్యం సేవించటం వల్ల గుండెపోటుతో మృతి చెందిందని కుటుంబీకులు చెప్పినట్లుగా తెలుస్తోంది. టీనా సోషల్ మీడియాలో షేర్ చేసిన చివరి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read - BRIDE DIED AT HER WEDDING : పెళ్లి పీటలపైనే వధువు మృతి.. విశాఖలో మిస్టరీ
Also Read - Kiara Advani Photos: నెట్టింట హాట్ పిక్స్ తో రామ్ చరణ్ హీరోయిన్ హల్ చల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook