Gas Cylinder Price: డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర మరోసారి పెరిగింది. దేశంలో గ్యాస్ సిలెండర్ ధర ఇప్పుడు వేయి దాటేసింది. ఏ నగరంలో గ్యాస్ సిలెండర్ ధర ఎంత ఉందో తెలుసుకుందాం..
సామాన్యుడి జేబుకు మరోసారి చిల్లు పడుతోంది. ఆయిల్ కంపెనీలు మరోసారి డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర పెంచడంతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. దేశంలో ఇప్పుడు గ్యాస్ సిలెండర్ ధర వేయి రూపాయలు దాటేసింది. కమర్షియల్ సిలెండర్ ధర గతంలోనే 2 వేల రూపాయలు దాటేయగా ఇప్పుుడు మరింతగా పెరిగింది.
ఇవాళ్టి నుంచి వంట గ్యాస్ డొమెస్టిక్ సిలెండర్‌పై 3 రూపాయలు 50 పైసలు పెరిగింది. ఫలితంగా సిలెండర్ ధర వేయి రూపాయలుపైనే ఉందిప్పుడు. ఢిల్లీ, ముంబై నగరాల్లో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర 1003 రూపాయలు కాగా. కోల్‌కతాలో 1029 రూపాయలుంది. అటు చెన్నైలో 1018.5 రూపాయలకు చేరుకుంది.
కమర్షియల్ సిలెండర్ ధర
డొమెస్టిక్ సిలెండర్ ధరతో పాటు కమర్షియల్ ఎల్పీజీ సిలెండర్ ధరలో కూడా 8 రూపాయలు పెరిగింది. ఇవాళ్టి నుంచి 19 కిలోల కమర్షియల్ సిలెండర్ ధర ఢిల్లీలో 2 వేల 354 రూపాయలుంది. అటు కోల్‌కతాలో 2 వేల 454 రూపాయలు కాగా, ముంబైలో 2 వేల 306 రూపాయలుంది. చెన్నైలో 2 వేల 507 రూపాయలు పలుకుతోంది. మే నెలలోనే గ్యాస్ సిలెండర్ ధర 50 రూపాయలు పెరిగింది. ఆ తరువాత డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర 999.50 రూపాయలకు చేరుకుంది. అంతకుముందు కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరపై 102 రూపాయలు పెరిగింది.
ఈ ఏడాది ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర చాలాసార్లు పెరిగింది. ఏప్రిల్ 1న 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 250 రూపాయలు పెరిగి..2253 రూపాయలైంది. అంతకుముందు అంటే 2022 మార్చ్ 1న కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 105 రూపాయలు పెరిగింది. అంటే గత కొద్దినెలలుగా గ్యాస్ సిలెండర్ ధర పెరుగుతూనే ఉంది.
Also read: Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, ఇవాళ మే 19 దేశంలో బంగారం ధరలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.