Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, ఇవాళ మే 19 దేశంలో బంగారం ధరలు ఇలా

Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. నిన్న మొన్నటి వరకూ భారీగా పెరిగిన బంగారం ధర కాస్త తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 19, 2022, 08:19 AM IST
Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, ఇవాళ మే 19 దేశంలో బంగారం ధరలు ఇలా

Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. నిన్న మొన్నటి వరకూ భారీగా పెరిగిన బంగారం ధర కాస్త తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధర విపరీతంగా పెరిగింది. గత కొద్దిరోజుల క్రితం వరకూ పెరిగిన బంగారం ధర కాస్త తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, డాలర్ విలువ వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ఎప్పటికప్పుుడు బంగారం ధరలు మారుతుంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధలలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 790 రూపాయలుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 290 రూపాయలుంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 100 రూపాయలుంటే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 290 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 100 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 290 రూపాయలుంది. చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 390 రూపాయలుంటే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 7 వందలుంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 290 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 100 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 290 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: Google: మరో 3 యాప్స్ పై గూగుల్ నిషేధం.. ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News