Benefits of Cardamom Tea: ఏలకుల టీ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

Benefits of Cardamom Tea: ఏలకులు ఆహార రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా బిర్యానీ, ఖీర్‌లలో కూడా వినియోగిస్తారు. ఏలకుల్లో రుచితో పాటు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కావున  అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 29, 2022, 01:13 PM IST
  • ఏలకుల టీ వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు
  • జీర్ణ క్రియ శక్తిని మెరుగుపరుస్తుంది
  • గుండె జబ్బులను దూరం చేస్తుంది
Benefits of Cardamom Tea: ఏలకుల టీ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

Benefits of Cardamom Tea: ఏలకులు ఆహార రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా బిర్యానీ, ఖీర్‌లలో కూడా వినియోగిస్తారు. ఏలకుల్లో రుచితో పాటు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కావున  అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. చాలా మంది వీటిని మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇవి తీపి వంటల రుచి పెంచేందుకు కూడా వాడతారు.  ఏలకుల టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు తెలుపుతున్నారు. ఏలకులతో చేసిన టీ తాగడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఏలకులలో పోషకాలు:

ఏలకులు రెండు రకాలుగా ఉంటాయని మనందరికీ తెలుసు. ఆకుపచ్చని వాటిని చిన్న ఏలకులని, గోధుమ లేదా నల్లని రంగు ఉన్న వాటిని పెద్ద ఏలకులు అని పిలుస్తారు. దీనిని గరం మసాలాలో కూడా ఉపయోగిస్తారు. చిన్న ఏలకులలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, ఐరన్, కాల్షియం, మాంగనీస్, కాపర్, థయామిన్, రైబోఫ్లావిన్ మొదలైన విటవిన్లు ఉంటాయి.

ఏలకుల టీలో కావలసినవి:

Stylecrase.comలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. ఏలకులు టీలో ఫినోలిక్ యాసిడ్‌లు, స్టెరాల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో అధికంగా యాంటీఆక్సిడెంట్‌ ఉంటే వీటిని తొలగించడాని తోడ్పడతాయి.

ఏలకుల టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

1. జీర్ణ క్రియ శక్తిని మెరుగుపరుస్తుంది.

2. మలబద్ధకం, పొట్టలో తిమ్మిరి సమస్యలను తొలగిస్తుంది.

3. ఏలకుల టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

4. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది.

5.హైపర్ టెన్షన్ సంబంధించిన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది.

6.  రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా రక్షిస్తుంది.

7. సీరమ్‌లోని మంచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించకుండా నిరోధిస్తుంది.

8. రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా కొనసాగుతుంది.

9. గుండె జబ్బులను దూరం చేస్తుంది.

10. గొంతు నొప్పి, పొడి దగ్గు రక్షిస్తుంది.

Also Read: onion hair growth tips: మీ జుట్టు రాలుతుందా..అయితే ఈ సమస్యకు ఉల్లిపాయతో చెక్ పెట్టండి..!!

Also Read: onion hair growth tips: మీ జుట్టు రాలుతుందా..అయితే ఈ సమస్యకు ఉల్లిపాయతో చెక్ పెట్టండి..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News