Harbhajan Singh, Shoaib Akhtar and Suresh Raina predicts Gujarat Titans wins IPL 2022 Title: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ఆరంభం కానుంది. ట్రోఫీ కోసం కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం (మే 29) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ రాత్రి 7.30 గంటలకు పడనుండగా.. మ్యాచ్ 8 గంటలకు ఆరంభం కానుంది. అయితే ఫైనల్ పోరులో గెలిచేదెవరని చాలా మంది ప్రముఖ క్రికెటర్లు జోస్యం చెపుతున్నారు.
స్పోర్ట్స్ కీడాతో పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... 'రాజస్తాన్ రాయల్స్ 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ జ్ఞాపకార్థం గుజరాత్‌ను ఓడించి టైటిల్ గెలవాలి. వార్న్ కోసమైనా రాజస్తాన్ గెలవాలని నా మనసు కోరుకుంటోంది. అయితే ముందునుంచి గుజరాత్ టైటాన్స్ లేదా లక్నో సూపర్ జెయింట్ టైటిల్ గెలవాలని కోరుకున్నాను. కొత్త టీమ్ గుజరాత్ టోర్నీ ఆసాంతం అదరగొట్టింది. కాబట్టి గెలుపొందేందుకు గుజరాత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి' అని అన్నారు.
టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ... 'గుజరాత్ గెలుస్తుందని నా హృదయం చెబుతోంది. అయితే జోస్ బట్లర్ రాణిస్తే చాలా ప్రమాదకరం. బట్లర్‌ను గుజరాత్ బౌలర్లు ఆపగలిగితే సగం విజయం సొంతమయినట్టే. గుజరాత్‌కు మంచి పేసర్లు, స్పిన్నర్లు ఉన్నారు. షమీ vs బట్లర్ మధ్య గొప్ప పోటీ ఉంటుందని నేను భావిస్తున్నా. షమీ ఎలాంటి బ్యాటర్‌ను అయినా అవుట్ చేయగలడు. గుజరాత్‌దే పైచేయి అని నేను అనుకుంటున్నాను. ఇది టీ20 కాబట్టి మ్యాచును అంచనా సరిగ్గా అంచనావేయలేం. రెండు జట్ల ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్' అని తెలిపారు.
మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా మాట్లాడుతూ... 'రాజస్థాన్ రాయల్స్ కంటే గుజరాత్ టైటాన్స్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందని భావిస్తున్నా. ఎందుకంటే.. వారికి నాలుగైదు రోజుల మంచి విశ్రాంతి, ప్రాక్టీసు లభించింది. ఈ సీజన్‌లో మంచి టెంపోతో ఆడుతున్నారు. అయితే రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ క్రీజులో ఉన్నప్పుడు గుజరాత్ బౌలర్లు బాగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. రాజస్థాన్ జట్టుని ఏమాత్రం తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే సంజూ సేన పడి లేచిన కెరటంలా పుంజుకుంది. అహ్మదాబాద్‌లో వికెట్ అద్భుతంగా ఉంది. బ్యాటర్లు పరుగులు చేసే అవకాశం ఉంది' అని అన్నారు.
Also Read: IPL Final: ఐపీఎల్ ఫైనల్... ఒకవేళ వర్షం అడ్డుపడితే.. సూపర్ ఓవర్ సాధ్యం కాకపోతే.. విజేత ఎవరంటే..?
Also Read: IPL 2022 Prize Money: ఐపీఎల్ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook