Weight Loss: ప్రస్తుతం ఎవ్వరూ శరీరం మీద శ్రద్ధ పెట్టడం లేదు. దీని వల్ల బరువు పెరిగి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. హెల్తీ ఆరోగ్యం కోసం తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుంగా ఫిట్‌నెస్ కోసం ఉదయం పూట యోగా చేయాలని వారు తెలుపుతున్నారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి యోగా ఉత్తమమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. యోగా వల్ల మనసుకు ప్రశాంతతతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అందుకే రోజూ ఉదయాన్నే లేచి యోగా చేయడం వివిధ లాభాలు చేకూరుతాయని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి ఈ యోగా ఆసనాలు చేయండి:
బద్ధ త్రి కోనాసనం:
1. రెండు పాదాల కింద ఒక చిన్న తువాలను వెసుకొండి.
2. కుడి కాలును కుడివైపుకు మడిచి, కుడివైపుకు వంచండి
3. మీ భుజం ఎంత ఎత్తులో ఉందో, రెండు చేతులను ఒకే ఎత్తులో పక్కకు చాచండి.
4. ఎడవ ముక్కు రంధ్రం నుంచి గాలి పీల్చి కుడివైపుకి వంగండి.
5. ఇప్పుడు కుడి చేతితో కుడి పాదాన్ని తాకడానికి ప్రయత్నించండి.
6. ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి.. కాళ్లను ఎడమ చేతి వేళ్ల వైపు ఉంచాలి.
7. అదేవిధంగా మరొక చేతితో ఇలానే వ్యాయామం చేయాలి.
8. ఇలా 20 సార్లు చేయండి
డైనమిక్ ఆంజనేయాసనం:
1. మొదటగా యోగా మ్యాట్ తీసుకోండి. దానిపై వజ్రాసనంలో కూర్చోండి.
2. ఎడమ పాదాన్ని వెనక్కి తీసుకోండి.
3. కుడి పాదం యొక్క భాగాన్ని నేలపై ఉంచండి.
4. రెండు చేతులను తలపైకి తీసుకుని కలపండి.
5. ఇప్పుడు నెమ్మదిగా వెనుకకు వంగడానికి ప్రయత్నించండి
6. చేతులను మీకు వీలైనంత వెనుకకు పెట్టండి.
7. 30 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండండి
8. ఆ తర్వాత మళ్లీ నిలబడండి
Also Read: Pigeon Pea Benefit: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ పన్నును ట్రై చేయండి..!
Also Read: Six pack Tips: నాలుగు వారాల్లో సిక్స్ ప్యాక్ కోసం పది ముఖ్యమైన సూచనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook