Rana Daggubati, Sai Pallavi starring Virata Parvam movie Warrior Song released: రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'విరాట పర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంను డి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. నక్సలిజం నేపథ్యంలో 1990ల్లో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తితో విరాట పర్వం తెరకెక్కింది. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ప్రొమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్ర యూనిట్.. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఆదివారం విరాట పర్వం సినిమాలోని విప్లవ సాంగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఒక నిమిషం 54 సెకండ్ల నిడివిగల ఈ వీడియో.. 'మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే..' అంటూ సాగింది. 'రౌద్రరపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనది.. ఛలో ఛలో ఛలో.. పరుగెత్తు', 'దొరోని తలుపుకు తాళంలా, గడీల ముంగట కుక్కల్లా? ఎన్నాళ్లు? ఇంకెన్నాళ్లు? మన బతుకులు మారేదెన్నాళ్లు', 'ఆడబిడ్డ రక్షణకై పోరాటం, దళితుని ఆత్మగౌరవానికై పోరాటం, పేదోడి ఆకలి ముద్దకై పోరాటం, రైతు నాగలి సాలుకై పోరాటం' అన్న చరణాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. జనాలను ఉద్యమానికి ఉత్తేజితులను చేస్తూ విప్లవ పాట సాగింది.
విరాటపర్వంలోని ఈ విప్లవగీతం పాటను సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలితో కలిసి రానా ఆలపించారు. ఈ పాటను జిలుకర శ్రీనివాస్ రచించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. తెలంగాణలో 1990 దశకంనాటి నక్సలైట్ ఉద్యమాల స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కామ్రేడ్ రవన్నగా రానా, ఆయన ప్రేయసి వెన్నెలగా సాయి పల్లవి నటించారు. నవీన్ చంద్ర సీనియర్ ఉద్యమకారుడు రఘన్నగా, ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా నటించారు.
Also Read: ఆ అవకాశం నాకు వస్తే.. ఎంఎస్ ధోనీ బుర్రలో ఏముందో చదువుతా: కార్తీక్
Also Read: Anushka Sharma: పెళ్లయినా తగ్గేదేలే.. స్విమ్ సూట్ ధరించి అనుష్క శర్మ సెల్ఫీలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.