Strawberry Moon Today: ఇవాళ పౌర్ణమి. ఈరోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఆకాశంలో చంద్రుడు సూపర్‌మూన్‌లా కనిపించనున్నాడు. సాధారణ పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడి కన్నా ఇవాళ కనిపించే చంద్రుడు 10 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అలాగే, సాధారణ పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడి కన్నా పెద్దదిగా కనిపిస్తాడు. దీన్నే 'స్ట్రాబెర్రీ మూన్' అని కూడా పిలుస్తారు. చంద్రుడు భూమికి మరింత దగ్గరగా రావడం వల్లే ఇలా జరుగుతుంది. సాధారణ రోజుల్లో కన్నా ఈరోజు చంద్రుడు మరో 16 వేల మైళ్ల మేర భూమికి దగ్గరగా వస్తాడు.దీన్నే 'పెరిజీ' అని పిలుస్తారు.
స్ట్రాబెర్రీ మూన్ అంటే ఏమిటి :
స్ట్రాబెర్రీ మూన్ అంటే చంద్రుడు స్ట్రాబెర్రీలా కనిపిస్తాడనో లేక ఆ రంగులో కనిపిస్తాడనో కాదు. ఇది అమెరికన్ మూలవాసులైన అక్కడి గిరిజన తెగల వారు పెట్టిన పేరు. సాధారణంగా జూన్ నెలలో స్ట్రాబెర్రీలు కోతకు సిద్ధంగా ఉంటాయి. ఈ సమయంలో ఏర్పడే పౌర్ణమి కావడంతో అక్కడి ప్రజలు దీనికి స్ట్రాబెర్రీ మూన్ అని పేరు పెట్టారు.
స్ట్రాబెర్రీ మూన్ ఆకాశంలో ఎప్పుడు కనిపిస్తుంది :
భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 5.22 గం. సమయంలో ఆకాశంలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుంది. సాధారణంగా సూపర్మూన్స్ ఏడాదిలో మూడు లేదా నాలుగుసార్లు మాత్రమే కనిపిస్తాయి. అది కూడా వరుస నెలల్లో వస్తాయి. ఈసారి పౌర్ణమి రోజున హిందువులు జరుపుకునే 'వట్ పూర్ణిమ' పండగ కూడా కావడం విశేషం. ఈరోజున వివాహిత స్త్రీలు మర్రిచెట్టుకు ముడుపు కట్టి ఉపవాస దీక్ష చేస్తారు. తద్వారా తమ భర్తలు దీర్ఘాయిష్షు పొందుతారని నమ్ముతారు.
Also Read: Horoscope Today June 14th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తమ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.