President Elections:వెంకయ్యతో విజయసాయి రెడ్డి భేటీ.. రాష్ట్రపతి ఎన్నికపై జగన్ మాట ఇదేనట!

President Elections:భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక ఓటింగ్ అవసరమా అన్నది తేలలేదు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవానికి అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ ఇద్దరు నేతలు విపక్ష పార్టీలతోనూ మాట్లాడుతున్నారు.

Written by - Srisailam | Last Updated : Jun 15, 2022, 05:14 PM IST
  • రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు మొదలు
  • వెంకయ్య నాయుడితో విజయసాయి రెడ్డి భేటీ
  • మమత నుంచి పిలుపు రాలేదన్న సాయి రెడ్డి
President Elections:వెంకయ్యతో విజయసాయి రెడ్డి భేటీ.. రాష్ట్రపతి ఎన్నికపై జగన్ మాట ఇదేనట!

President Elections: భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక ఓటింగ్ అవసరమా అన్నది తేలలేదు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవానికి అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ ఇద్దరు నేతలు విపక్ష పార్టీలతోనూ మాట్లాడుతున్నారు. మరోవైపు బీజేపీ వ్యతికక పార్టీలను ఏకం చేసి ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. విపక్షాల తీరును బట్టి రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అధికార ఎన్డీఏ కూడా రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. 

రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 10 లక్షలకు పైగా ఓట్లు ఉండగా.. అధికార ఎన్డీఏ కూటమికే మెజార్టీ ఉంది. అయితే కావాల్సిన మెజార్టీకి మాత్రం ఇంకా 1.2 శాతం అంటే దాదాపు 12 వేల ఓట్లు అవసరముంది. వీటి కోసం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, బీజేడీ. అన్నాడీఎంకే నేతలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతుందోని తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థుల రేసులో ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు గిరిజన నేత ద్రౌపది ముర్ము, మైనార్టీ వర్గానికి చెందిన కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వెంకయ్య నాయుడి విషయంలో వైసీపీ వ్యతిరేకంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దలతో సీఎం జగన్ మాట్లాడినప్పుడు.. వెంకయ్య అభ్యర్థిత్వం విషయంలో ఆయన అంగీకారం తెలపలేదనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై వైసీపీ మాత్రం స్పందించలేదు. తాజాగా వై,ీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి.. ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో సమావేశమయ్యారు.

రాష్ట్రపతి ఎన్నికల వేళ వెంకయ్య నాయుడితో జగన్ సన్నిహితుడైన సాయి రెడ్డి భేటీ కావడం చర్చగా మారింది. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అయితే విజయసాయి రెడ్డి మాత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని.. కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్​హోదాలోనే కలిసినట్లు తెలిపారు. కామర్స్‌ స్థాయి సంఘం నివేదికలను సమర్పించానని తెలిపారు. వెంకయ్యతో సమావేశం తర్వాత మాట్లాడిన సాయి రెడ్డి.. రాష్ట్రపతి ఎన్నికల్లో  వైసీపీ మద్దతు ఎవరికి అనేది సీఎం జగన్ నిర్ణయిస్తారని చెప్పారు. మమతా బెనర్జీ నుంచి తమకు పిలుపు రాలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రెసిడెంట్ ఎన్నికల్లో బరిలో ఉంటాయో లేదో తనకు తెలియదన్నారు. వైసీపీ మాత్రం బీజేపీతోనే ఉంటుందనే సంకేతం ఇచ్చారు.  

Read also: Mamatha Meeting: మమత భేటీకి పలువురు విపక్ష నేతల డుమ్మా.. కాంగ్రెస్ తమ శత్రువన్న  వైసీపీ, ఎంఐఎం 

Read also: Indian Railways Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 1.48 లక్షల రైల్వే ఉద్యోగాల భర్తీకి ప్రకటన!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News