Pradosha vratham 2022: ప్రదోష వ్రతం ప్రతినెలా ఆచరించేదే అయినా..ఆషాఢ మాసంలో జరుపుకునే ప్రదోష వ్రతానికి మహత్యముంది. ఇది ఎప్పుడు, ఏ తిధిలో వస్తోంది, శుభ ముహూర్తం, ప్రాధాన్యత వివరాలు తెలుసుకుందాం.
ప్రతినెలా రెండు పక్షాల త్రయోదశి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ప్రదోష వ్రతం శివుడికి చాలా ప్రియమైందని ప్రతీతి. ఈ వ్రతం ఉండటం వల్ల..శివుడు వెంటనే ప్రసన్నమౌతాడని..భక్తుల కోర్కెలు తీరుస్తారని విశ్వాసం. అయితే ఆషాఢ మాసంలోని కృష్ణపక్షం త్రయోదశి నాడు జరుపుకునే ప్రదోష వ్రతానికి చాలా మహత్యముందని చెబుతారు. ఈసారి ప్రదోష వ్రతం జూన్ 26వ తేదీ ఆదివారం వచ్చింది. ఆదివారం కావడంతో రవి ప్రదోష వ్రతమని పిలుస్తారు. ఈ రోజున శివపార్వతులకు పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. పూజ వ్రతం కారణంగా శివుడు వెంటనే ప్రసన్నమౌతారని ప్రతీతి. అంతేకాకుండా భక్తుల అన్ని కష్టాలు దూరమౌతాయి. శివుడి ఆశీర్వాదం కారణంగా భక్తుల అన్ని కోర్కెలు నెరవేరుతాయి. దాంతోపాటు వంశం, ధన సంపదలు వృద్ధి చెందుతాయి. ఆషాఢమాసం ప్రదోష వ్రతం తిధి, శుభ ముహూర్తం గురించి తెలుసుకుందాం..
ప్రదోష వ్రతం ఎప్పుడు
హిందూమతంలో ప్రతి తిధికి ఓ విశేష మహత్యముంది. ప్రతి తిధి ఏదో ఒక దేవతకు అంకితం. ప్రదోష వ్రతం శివుడికి అంకితం. ఆషాఢమాసం కృష్ణపక్షంలోని త్రయోదశి నాడు అంటే జూన్ 25వ తేదీ రాత్రి 1 గంటల 9 నిమిషాలకు ప్రారంభమై...జూన్ 26వ తేదీ రాత్రి 1 గంట 25 నిమిషాలవరకూ ఉంటుంది.
ప్రదోష వ్రతం పూజ ఎప్పుడూ ప్రదోష కాలంలోనే చేయాల్సి ఉంటుంది. ఆషాఢ మాసంలో త1లి ప్రదోష వ్రతం శుభ ముహూర్తం జూన్ 26 సాయంత్రం 7 గంటల 23 నిమిషాలకు ప్రారంభమై..రాత్రి 9 గంటల 23 నిమిషాలవరకూ ఉంటుంది. ఈ రోజున పూజ చేసేందుకు 2 గంటలసేపు శుభ ముహూర్తముంది. అటు జూన్ 26న అభిజీత ముహూర్తం 11 గంటల 56 నిమిషాల నుంచి మద్యాహ్నం 12 గంటల 52 నిమిషాలవరకూ ఉంది. ఈ ముహూర్తంలో ఉదయపు పూజ చేయవచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రదోష వ్రతం జీవితంలో సంతానం, సంపత్తి, ధనం, సుఖ సంతోషాల కోసం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఉండటం వల్ల ఆ వ్యక్తికి కావల్సినవి అన్నీ లభిస్తాయి. అతని అన్ని కష్టాలు దూరమౌతాయి. శివుడి కటాక్షం పూర్తిగా లభిస్తుంది.
Also read: Lemon Remedies: నిమ్మకాయతో ఇలా చేసినప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు..మీ ఇంట అష్ట ఐశ్వర్యాలే
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook