Mango Peels Benefits: మామిడి తొక్కలతో కేన్సర్‌కు చెక్, ఇక పొరపాటున కూడా తొక్కలు పాడేయవద్దు

Mango Peels Benefits: మేంగో సీజన్ ముగుస్తోంది. మామిడి పండ్లే కాదు..మామిడి తొక్కలతో కూడా లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలు తెలుసుకుంటే ఇక పొరపాటున కూడా మామిడి తొక్కలు వదిలిపెట్టరు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 26, 2022, 07:55 PM IST
Mango Peels Benefits: మామిడి తొక్కలతో కేన్సర్‌కు చెక్, ఇక పొరపాటున కూడా తొక్కలు పాడేయవద్దు

Mango Peels Benefits: మేంగో సీజన్ ముగుస్తోంది. మామిడి పండ్లే కాదు..మామిడి తొక్కలతో కూడా లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలు తెలుసుకుంటే ఇక పొరపాటున కూడా మామిడి తొక్కలు వదిలిపెట్టరు. 

మామిడిని పండ్ల రారాజుగా పిలుస్తారు. సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌గా ఏదాదికోసారి వచ్చే మామిడి పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. మామిడి పండ్లే కాకుండా మామిడి తొక్కలతో కూడా అద్భుత ప్రయోజనాలున్నాయనే విషయం మీకు తెలుసా.. మామిడి తొక్కలతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

సాధారణంగా మామిడి పండ్లు తినేటప్పుడు తొక్కలు ఒలిచి పడేస్తుంటాం. రుచి లేదా శుభ్రత కారణంతో తొక్కల్ని పడేయడం సహజం. కానీ మామిడి తొక్కలతో కూడా చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు ఏ విధమైన నష్టం లేదంటున్నారు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందాలంటే ఇక నుంచి మామిడి తొక్కల్ని పాడేయవద్దు. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి లాభమే తప్ప నష్టం లేదు. మామిడి రుచి పోతుందనే కారణంగా చాలామంది తొక్కలు ఒలిచి పాడేయడం చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మామిడి పండ్లను ఒకటికి రెండుసార్లు లేదా గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసి తొక్కతో సహా తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 

మామిడి తొక్కలతో కలిగే ప్రయోజనాలు

మామిడి తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అత్యధికంగా ఉన్నాయి. ఇవి కేన్సర్ నుంచి కాపాడుతాయి. మామిడి తొక్కలతో లంగ్స్ కేన్సర్, బ్రెయిన్ కేన్సర్, కోలన్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్‌ల నుంచి రక్షించుకోవచ్చు. మామిడి తొక్కల్లో ఫైటోన్యూట్రియంట్లు అత్యధికంగా ఉంటాయి. మరోవైపు మామిడి తొక్కలతో బరువు తగ్గేందుకు కూడా దోహదపడతాయి. ఇక నుంచి మామిడిపండ్లను తొక్కలతో సహా తినడం అలవాటు చేసుకోండి.

Also read: Hair Packs: అందమైన పొడుగైన జుట్టు కోరుకుంటున్నారా..ఈ హోమ్‌మేడ్ ప్యాక్స్ వాడి చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News