/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Netizens Trolls Hardik Pandya for not giving bowling to Umran Malik: ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్‌ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి మరో 16 బంతులు ఉండగానే ఛేదించింది. ఓపెనర్ దీపక్‌ హుడా (29 బంతుల్లో 47 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు హ్యారీ టెక్టార్‌ (64 నాటౌట్‌; 33 బంతుల్లో 64, 36) హాఫ్ సెంచరీ బాదడంతో ఐర్లాండ్‌ 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. 

ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ హార్దిక్‌ పాండ్యాపై అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌ పట్ల అతడు వ్యవహరించిన విధానమే ఇందుకు కారణం. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 2022లో అద్భుత ప్రదర్శన చేసిన స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తొలి టీ20 మ్యాచ్‌ ద్వారా భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఒకే ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేసిన  ఉమ్రాన్‌.. 14 పరుగులు సమర్పించుకున్నాడు. లెగ్ బైస్‌తో కలిపి ఆ ఓవర్లో మొత్తంగా 18 రన్స్ వచ్చాయి. దాంతో కెప్టెన్ హార్దిక్ అతడికి మరో ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు. 

మరోవైపు ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన హార్దిక్‌ పాండ్యా 13 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఎనిమిదవ ఓవర్ వేసిన హార్దిక్ మరో 13 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా హార్దిక్ 2 ఓవర్లలో 26 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో హార్దిక్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మరో ఓవర్ ఉమ్రాన్‌ మాలిక్‌కు ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు హార్దిక్‌ను ట్రోల్స్ చేస్తూ.. మీమ్స్, కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 'ఉమ్రాన్‌ మాలిక్‌ పట్ల నువ్ వ్యవహరించిన విధానం బాగాలేదు', 'సెల్ఫిష్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్యా', 'గొప్ప ప్రదర్శన లేకున్నా నువ్వు రెండు ఓవర్లు వేశావు, ఉమ్రాన్‌కు ఒకే ఓవర్‌ ఎందుకు ఇచ్చావు', 'బీసీసీఐ.. ఇలాంటి కెప్టెన్ అవసరమా', 'ముందు జట్టు గురించి ఆలోచించు.. ఆ తర్వాతే నువ్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఉమ్రాన్ మాలిక్ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఉమ్రాన్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్‌లను బెంబేలెత్తించాడు. లీగ్ ఆసాంతం స్థిరంగా 150 కిమీ వేగంతో బంతులు సంధించిన ఉమ్రాన్.. ఓ మ్యాచులో గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. సన్‌రైజర్స్ ఆడిన అన్ని మ్యాచులలో 'ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు' ఉమ్రాన్‌దే. ఐపీఎల్‌ 2022లో 14 మ్యాచులు ఆడిన ఉమ్రాన్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Alia Bhatt Pregnancy: త‌ల్లి కాబోతున్న అలియా భ‌ట్‌.. వైర‌ల్ అవుతున్న ఫోటో!

Also Read: Monsoon Skin Care: వానలో ఎక్కువ సేపు తడుస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Selfish Captain: Netizens Trolls Hardik Pandya for not giving bowling to Umran Malik in IND vs IRE
News Source: 
Home Title: 

Hardik Pandya Trolls: సెల్ఫిష్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. బీసీసీఐ ఇలాంటి సారథి అవసరమా? 

Hardik Pandya Trolls: సెల్ఫిష్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. బీసీసీఐ ఇలాంటి సారథి అవసరమా? మండిపడుతున్న ఫాన్స్
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

సెల్ఫిష్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్యా

బీసీసీఐ ఇలాంటి సారథి అవసరమా? 

మండిపడుతున్న ఫాన్స్

Mobile Title: 
సెల్ఫిష్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. బీసీసీఐ ఇలాంటి సారథి అవసరమా? 
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Monday, June 27, 2022 - 15:04
Request Count: 
121
Is Breaking News: 
No