Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్, బీజేపీపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. కార్పొరేట్ కంపెనీల పైసలతో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా కాంగ్రెస్ అనేక హామీలను ఇచ్చిందని గుర్తు చేశారు.
వీటిపై గత 8 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తే..16 నెలలపాటు అటువైపు చూడలేదని విమర్శించారు రేవంత్‌రెడ్డి. జీఎస్టీ ద్వారా జరిగిన అన్యాయంపై ఎందుకు నోరు మెదపలేదన్నారు. సమస్యలపై చర్చలు జరపకుండా ఫ్లెక్సీలతో చిల్లర తగాదాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ లాంటి చిల్లర వ్యక్తి చూడలేదన్నారు.
సికింద్రాబాద్‌లో కాల్పులు ఎవరు చేశారన్న దానిపై ఇంత వరకు క్లారిటీ రాలేదని చెప్పారు. లోపభూయిష్టంగా ఉన్న అగ్నిపథ్ పథకంపై ఎందుకు మోదీని ప్రశ్నించడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు మరోసారి అన్యాయం చేసేందుకు మోదీ మళ్లీ వచ్చారని..8 ఏళ్లలో రాష్ట్రానికి చిల్లి గవ్వ ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఏర్పాటును శంకించిన మోదీకి..ఈగడ్డపై అడుగు పెట్టే అర్హత లేదన్నారు రేవంత్‌రెడ్డి.
ఇప్పటికైనా రాష్ట్ర సీఎం రాజకీయ చతురతో వ్యవహరించాలన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడేలా పోరాటాలని హితవు పలికారు. మొదట సీఎం కేసీఆర్‌ను కలిసి ఏ నేతనైనా తాము కలవబోమని స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు రేవంత్‌రెడ్డి.
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు..రాగల 48 గంటల్లో అక్కడే భారీ వర్షాలు..!
Also read:Telangana Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి పచ్చజెండా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook