Diet Plan for 40 Plus Men: వయసు పెరిగేకొద్దీ బాధ్యతలు మీద పడుతుంటాయి. ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలామంది ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. ముఖ్యంగా 40 దాటిన తర్వాత ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యల బారినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి 40 ఏళ్లు దాటిన తర్వాత.. ముఖ్యంగా పురుషులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ముందు ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి.
40 ఏళ్లు దాటిన పురుషులకు హెల్తీ డైట్ ప్లాన్ :
పురుషులు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తద్వారా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. బీన్స్, బెర్రీలు,అవకాడో, పాప్ కార్న్, డ్రై ఫ్రూట్స్, యాపిల్స్, బ్రకోలీ, పొటాటో,నట్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి.
గుడ్ కొలెస్ట్రాల్ ఫుడ్స్ :
రోజూ వారీ ఆహారంలో గుడ్ కొలెస్ట్రాల్ ఫుడ్స్‌ని చేర్చుకోవాలి. ఫ్లాక్స్, ఫ్యాటీ ఫిష్, చియా సీడ్స్, సోయా ప్రొడక్స్ట్, వెజిటేబుల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటి ఫుడ్స్ ద్వారా శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ అందుతుంది. గుడ్ కొలెస్ట్రాల్‌నే హైడెన్సిటీ లిపో ప్రోటీన్ అని పిలుస్తారు. గుడ్ కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల బారినపడే రిస్క్ తగ్గుతుంది.
తృణ ధాన్యాలు ఆరోగ్యానికి మంచివి.. :
తృణధాన్యాల్లో ఫైబర్‌తో పాటు వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలు దరిచేరవు. ఓట్స్, రెడ్ రైస్ రూపంలో తృణ ధాన్యాలను తీసుకోవచ్చు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. ప్రోటీన్ డైట్లో పాలు, గుడ్లు, చికెన్ చేర్చుకోవచ్చు.
(గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. దీన్ని అనుసరించే ముందు వైద్య సలహా తీసుకోండి. జీ తెలుగు న్యూస్ ఈ సమాచారాన్ని ఆమోదించదు)
Also Read: Rashmika Mandanna: లక్కు తోక తొక్కిన రష్మిక.. మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్.!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.