Vastu Tips For Tulsi: ఇంట్లో తులసి మొక్క ఉంటే సకల శుభాలు జరుగుతాయని వాస్తు శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. అయితే శ్రావణమాసంలో ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. తులసి మొక్కతో పాటు కొన్ని పూలు, పండ్ల మొక్కలను నాటితే, ఇంట్లో డబ్బు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని శాస్త్రం పేర్కొంది. అయితే శ్రావణమాసంలో ఏయే మొక్కలు నాటితే ఆర్థిక నష్టాలు, మనసిక ఇబ్బందులు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రావణమాసంలో ఇంట్లో ఈ మొక్కలను నాటండి:
పత్రి చెట్టు (Bilva Patra):
శ్రావణమాసం(Sravana Masam)లో పరమశివున్ని ఆరాధిస్తారు. అంతేకాకుండా ప్రత్యేకంగా బెల్లంతో చేసిన నైవేద్యంగా పెడతారు. శివుని ప్రితికరమైన పత్రి చెట్టు ఆకులను కూడా పూజా క్రమంలో వినియోగిస్తారు. అయితే ఇంట్లో ఈ మొక్కను శ్రావణమాసంలో నాటడం వల్ల వాస్తుకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా పత్రి చెట్టు(Bilva Patra)ను నాటడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు దూరమవుతాయి.
జమ్మి చెట్టు(Jammi Chettu):
వాస్తులో జమ్మి చెట్టును చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ మొక్కను నాటడం ద్వారా శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రం పేర్కొంది. తులసితో పాటు జమ్మి చెట్టు(Jammi Chettu)ను ఇంట్లో నాటితే శుభ పరిణామాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.
ఉమ్మెత్త మొక్క(Datura Plants):
శివునికి ఉమ్మెత్త మొక్క కూడా చాలా ప్రీతికరమైనది. కాబట్టి శివుని పూజలో ఈ పూలను తప్పకుండా ఆయనకు సమర్పించాలని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శ్రావణమాసం(Sravana Masam)లో ఆదివారం లేదా మంగళవారం ఇంట్లో ఉమ్మెత్త మొక్కను నాటండి. ఇలా చేయడం వల్ల కుటుంబం మొత్తానికి శివుని అనుగ్రహం లభిస్తుందని శాస్త్రంలో పేర్కొన్నారు.
అరటి మొక్క(Banana Plants):
అరటి మొక్కను నాటడం వల్ల విష్ణువు, బృహస్పతి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం పేర్కొంది. ఇంట్లో తులసి మొక్కతో పాటు అరటి మొక్కను నాటితే ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇవి నాటే ముందు పలు నియమాలు పాటించండి.. ఈ రెండు మొక్కలను పక్కపక్కనే నాటడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపు తులసి మొక్కను, కుడివైపు అరటి మొక్కను నాటడం మంచిదని శాస్త్రం పేర్కొంది.
సంపంగి మొక్క(Michelia ):
శ్రావణమాసం(Sravana Masam)లో ఇంట్లో సంపంగి మొక్కను నాటడం కూడా చాలా శ్రేయస్కరమని శాస్త్రం చెబుతోంది. ఈ మొక్క అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దీనిని నాటడం వల్ల ఆర్థికపరమైన సమస్యలన్ని తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈ మొక్కను వాయువ్య దిశలో నాటడం మంచిదని శాస్త్రం భావిస్తోంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Monsoon Makeup Tips: వానలో తడవడం వల్ల మేకప్ పోతోందా.. అయితే ఇలా చేయండి..!
Also Read: Sun Transit effect: కర్కాటక రాశిలో సూర్య సంచారం... ఈ రాశివారికి డబ్బే డబ్బు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Vastu Tips For Tulsi: శ్రావణమాసంలో తులసి మొక్కలలో పాటు ఈ మొక్కలను నాటండి.. ఆర్థిక పరమైన సమస్యలన్ని తొలగిపోతాయి..!
శ్రావణమాసంలో తులసి మొక్కలలో పాటు..
పత్రి చెట్టు మొక్కలను నాటండి
ఆర్థిక పరమైన సమస్యలన్ని తొలగిపోతాయి