Skin Care Tips: చర్మ సంరక్షణ చాలా అవసరం. అందానికి మెరుగులు దిద్దేది అదే. చర్మ సంరక్షణకు అత్యవసరమైన కొన్ని ముఖ్యమైన సూచనలు, టిప్స్ ఇప్పుడు పరిశీలిద్దాం. రాత్రి పూట పొరపాటున కూడా ఆ తప్పులు చేయవద్దు మరి..
చర్మ సంరక్షణ అనేది ప్రతిరోజూ ఉండాలి. ఆరోగ్యంతో పాటు హెల్తీ స్కిన్ కూడా చాలా అవసరం. చర్మ సంరక్షణ లేకపోతే పలు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ సమస్యల్లో ముడతలు, ఫాయిన్ లాయిన్స్, పింపుల్స్ వంటివి కీలకం. సాధారణంగా పగటి పూట స్కిన్‌కేర్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా..రాత్రి పూట వదిలేస్తుంటాం. చర్మం విషయంలో తెలిసో తెలియకో చాలా పొరపాట్లు చేస్తుంటాం. ఫలితంగా చర్మానికి హాని కలుగుతుంది. అందుకే రాత్రి సమయంలో చర్మానికి సంబంధించి ఏయే తప్పుల్ని లేదా పొరపాట్లను చేయకూడదో తెలుసుకుందాం.
చాలామంది మహిళలు రాత్రి వేళ పడుకునేముందు..మేకప్ కడగడం మర్చిపోతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. చర్మానికి హాని కల్గిస్తుంది. బయట్నించి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై మేకప్ ఉంటే తొలగించుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. పడుకునే ముందు ముఖంపై ఉన్న మేకప్ తొలగించకపోతే..చర్మంపై ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా చర్మంపై బ్లాక్‌హెడ్స్ , మచ్చలు, మరకలు తలెత్తుతాయి. అందుకే రాత్రి పడుకునేముందు తప్పకుండా క్లీన్సర్తో శుభ్రం చేసుకోవాలి.
కాటన్ తలగడ మంచిది కాదా
పడుకునేటప్పుడు కాటన్ తలగడ వాడటం అటు ఆరోగ్యానికి ఇటు చర్మానికి మంచిది కాదంటున్నారు చర్మ వైద్య నిపుణులు. కాటన్ తలగడ గట్టిగా ఉండటం వల్ల మీరు పడుకున్నప్పుడు అది మీ చర్మాన్ని నొక్కి పెడుతుంది. దీనివల్ల చర్మంపై ఉండే సెల్స్ దెబ్బతింటాయి. మరోవైపు కొలేజ్ తెగడంతో చర్మంపై ముడతలు ఏర్పడుతాయి. అందుకే పడుకునేటప్పుడు సిల్క్ లేదా శాటిన్ తలగడ వాడటం మంచిది.
చాలామంది రాత్రి వేళల్లోనే మాయిశ్చరైజర్లు వాడుతుంటారు. ఒకసారి రాస్తే సరిపోతుందనేది సాధారణంగా మహిళల అభిప్రాయంగా ఉంటుంది. కానీ పగటి పూట కూడా మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి అంటున్నారు బ్యుటీషియన్లు. ఇలా చేయడం వల్ల చర్మ సంరక్షణకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.
Also read: Cancer Treatment: బ్రెస్ట్ కేన్సర్ చికిత్సలో రెండు అద్భుత ఔషధాలకు గ్రీన్ సిగ్నల్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook