Kamika Ekadashi 2022: కామిక ఏకాదశి అంటే ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా చేస్తారు?

Kamika Ekadashi 2022: కామిక ఏకాదశి వ్రతం శ్రావణ మాసంలో వస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో భక్తులు సకల పాపాల నుండి విముక్తి పొందుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2022, 01:27 PM IST
  • జూలై 24న కామిక ఏకాదశి
  • ఈ రోజున శ్రీహరిని పూజిస్తారు
Kamika Ekadashi 2022: కామిక ఏకాదశి అంటే ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా చేస్తారు?

Kamika Ekadashi 2022: శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసం హిందువులకు చాలా పవిత్రమనది.  పంచాంగం ప్రకారం, శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశినే కామిక ఏకాదశి 2022 అంటారు. ఈ రోజున శ్రీహరిని (Lord Vishnu) పూజిస్తారు. కామిక ఏకాదశి వ్రతం (Kamika Ekadashi Vrat 2022) చేసి శ్రీమహావిష్ణువును పూజిస్తే భక్తులు కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.  ఈ సారి కామికా ఏకాదశిని ఉదయం తిథి ఆధారంగా జూలై 24న పాటిస్తున్నారు. ఈ వ్రత ప్రాముఖ్యత గురించి ఇప్పుడు  తెలుసుకుందాం. 

కామిక ఏకాదశి తేదీ
ప్రారంభం: 23 జూలై 2022, శనివారం ఉదయం 11.27 నుండి
ముగింపు: 24 జూలై 2022, ఆదివారం మధ్యాహ్నం 1:45 గంటలకు

వ్రత ప్రాముఖ్యత
కామికా ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా మీరు అనుకున్న పని నెరవేరుతుంది. అంతేకాకుండా కామిక ఏకాదశి వ్రతం లేదా ఉపవాసం చేయడం వల్ల శ్రీహరి ఆశీస్సులతోపాటు మీ పూర్వీకులు ఆశ్వీరాదాలు కూడా మీకు లభిస్తాయి. ఈ ఉపవాసం పాటించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో మరణానంతరం కూడా మోక్షాన్ని పొందుతారు. పాపాలు చేసేవారు ఎక్కువగా ఈ వ్రతాన్ని చేయమని పెద్దలు చెబుతారు. 

Also Read: Friday Puja Tips: శుక్రవారం ఈ చిన్న పని చేస్తే చాలు... త్వరలో మీరు బిలియనీర్ అవ్వడం పక్కా! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News