Onion-Garlic Peels Benefits: ఉల్లి-వెల్లుల్లి ఒలిచిన పొరలతో అద్భుత ప్రయోజనాలేంటో తెలిస్తే..వదిలిపెట్టరు

Onion-Garlic Peels Benefits: ఉల్లి..వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. ఇప్పుడు ఉల్లి..వెల్లుల్లి ఒలిచిన పొరలు కూడా మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లి, వెల్లుల్లి ఒలిచిన పొరలతో కలిగే ప్రయోజనాలు అద్భుతమంటున్నారు..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 16, 2022, 06:28 PM IST
Onion-Garlic Peels Benefits: ఉల్లి-వెల్లుల్లి ఒలిచిన పొరలతో అద్భుత ప్రయోజనాలేంటో తెలిస్తే..వదిలిపెట్టరు

Onion-Garlic Peels Benefits: ఉల్లి..వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. ఇప్పుడు ఉల్లి..వెల్లుల్లి ఒలిచిన పొరలు కూడా మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లి, వెల్లుల్లి ఒలిచిన పొరలతో కలిగే ప్రయోజనాలు అద్భుతమంటున్నారు..

పండ్ల తొక్కలతో కలిగే ప్రయోజనాల గురించి తెలిసినంతగా..ఇంట్లో రోజూ ఉపయోగించే కూరల తొక్కల గురించి తెలియదు. కూరగాయలతో ఎన్నెన్ని లాభాలుంటాయో..వాటి తొక్కలతో కూడా అన్నే లాభాలుంటాయి. ముఖ్యంగా ఉల్లి-వెల్లుల్లి. సాధారణంగా ఉల్లి-వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది పెద్దలు చెప్పే మాట. ఇప్పుడు ఉల్లి-వెల్లుల్లే కాదు..వాటి ఒలిచిన పొరలు కూడా అద్భుత ప్రయోజనాలు అందిస్తాయంటున్నారు ఆరోగ్య వైద్య నిపుణులు. ఆ లాభాలేంటో తెలుసుకుందాం..

ఉల్లి-వెల్లుల్లి ఒలిచిన పొరల్ని పాడేయవద్దు. వాటిని ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ ఎరువు మొక్కలకు చాలా మంచిది. ఉల్లి, వెల్లుల్లి పొరల్లో పెద్దమొత్తంలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్ ఉంటాయి. అందుకే మొక్కల కుండీల్లో వీటిని వేస్తే మంచి ప్రయోజనముంటుంది. 

ఇక మరో ముఖ్య ఉపయోగం జుట్టు సంరక్షణ కోసం. ఉల్లి పొరలతో జుట్టు కాంతివంతమౌతుంది. ఉల్లి పొరల్ని నీళ్లలో ఉడికించి..ఆ నీళ్లతో తల శుభ్రం చేసుకుంటే జుట్టు మెరుస్తుంది. అంతేకాదు జుట్టు నల్లగా మారేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీనికోసం ఉల్లి పొరల్ని నీళ్లలో ఓ అరగంట సేపు ఉడికించాలి. ఈ నీళ్లతో తల మాలిష్ చేసుకోవాలి. ఓ అరగంట తరువాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇది తలకు సహజసిద్ధమైన డైలా పనిచేస్తుంది. 

చాలా సందర్భాల్లో శరీరంలోని మాంసకృతుల్లో తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ  సమస్య నుంచి గట్టెక్కేందుతు ఉల్లి పొరల్ని నీళ్లలో 10-15 నిమిషాలు నానబెట్టాలి. రాత్రి నిద్రపోయేముందు..ఈ నీళ్లను తాగాలి. దీనివల్ల మజిల్ క్రాంప్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలామందికి చర్మం దురద వేస్తుంటుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు వివిధ రకాల మందుల్ని కూడా వినియోగిస్తుంటారు. కానీ ఇంట్లో లభించే ఉల్లి, వెల్లుల్లి పొరలతో ఈ ఇబ్బంది నుంచి చాలావరకూ ఉపశమనం పొందవచ్చు. నీళ్లలో ఈ రెండింటి పొరల్ని నానబెట్టి..చర్మానికి రాయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

Also read: Healthy food for Heart: మీ డైట్‌లో ఆ ఫ్రూట్స్ చేర్చుకుంటే..ఇక గుండె పదిలమే

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News