Vastu Tips: ఇంట్లో నెమలి పించాన్ని ఏ దిశలో ఉంచాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, నెమలి పించంను ఇంట్లో ఉంచడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. అయితే దానిని  ఏ దిశలో ఉంచాలనేది మీకు తెలుసుండాలి. నెమలి పించం ప్రయోజనాలు, దిశ గురించి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 03:01 PM IST
Vastu Tips: ఇంట్లో నెమలి పించాన్ని ఏ దిశలో ఉంచాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

Vastu tips for Peacock Feathers: వాస్తుశాస్త్రం ప్రకారం, నెమలి పించం ఇంట్లో పాజిటివిటీని తెస్తుంది. అంతేకాకుండా అనేక సమస్యలను దూరం చేస్తుంది. నెమలి పించం (Peacock Feathers) ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే లాభాలు, దీనిని ఏ దిశలో ఉంచాలనే విషయాలు తెలుసుకుందాం. 

నెమలి పించం ప్రయోజనాలు
>> ఇంట్లో నెమలి పించం ఉంచితే తల్లి లక్ష్మీదేవి, మాత సరస్వతి దేవి ఆశీస్సులు లభిస్తాయి.  
>> నెమలి పించంను వేణువుతో కలిపి ఇంట్లో ఉంచుకుంటే.. కుటుంబంలో అప్యాయత, అనురాగాలు పెరుగుతాయి.  
>>  వైవాహిక జీవితంలో టెన్షన్ ఉంటే పడకగదిలో నెమలి పించంను పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల జీవితం బాగుంటుంది.
>> ఎవరితోనైనా మీకు శత్రుత్వం ఉన్నట్లయితే నెమలి పించంపై వారి పేరు రాసి...మంగళ, శనివారాల్లో హనుమంతుని మందు పెట్టండి. తర్వాత రోజు దానిని తీసి నీటిలో వేయండి. ఇలా చేయడం వల్ల ఇతరులతో ఉన్న శత్రుత్వం నశిస్తుంది. 
>> మీపై గ్రహాల యొక్క అశుభ ప్రభావాలు పోవాలంటే.. ఆ గ్రహం యెుక్క మంత్రాన్ని  జపించండి. అనంతరం నెమలి ఈకపై నీటిని చల్లి అందరికీ కనిపించే మంచి ప్రదేశంలో ప్రతిష్టించండి. ఇలా చేయడం వల్ల మీపై గ్రహాల చెడు దృష్టి అంతమవుతుంది. 
>> మీ బిడ్డను ఇతరుల చెడు దృష్టి నుండి రక్షించాలనుకుంటే నెమలి ఈకలతో కూడిన వెండి రక్ష కట్టండి. 

ఏ దిక్కులో ఉంచాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఇంటి దక్షిణ దిశలో ఉన్న ఖజానాలో నెమలి పించాన్ని ఉంచినట్లయితే డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. ఒకవేళ మీపై రాహువు యెుక్క దోషాన్ని తొలగించాలనుకుంటే తూర్పు మరియు వాయువ్య దిశలో నెమలి ఈకలను పెట్టండి.  

(Note - ఈ కథనంలో అందించిన సమాచారం ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. Zee news దీన్ని ధృవీకరించలేదు)

Also Read: Tulsi Vastu Tips: తులసి చెట్టుకు నీరు పోసేటప్పుడు ఈ మంత్రం పఠిస్తే.. మీ ఇంట కనకవర్షమే..

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News