Tulsi Vastu Tips: తులసి చెట్టుకు నీరు పోసేటప్పుడు ఈ మంత్రం పఠిస్తే.. మీ ఇంట కనకవర్షమే..

Tulsi Vastu Tips:  హిందువులు పవిత్రంగా భావించే మెుక్కలలో తులసి ఒక్కటి. తులసి చెట్టుకు నీరు పోసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 02:20 PM IST
  • తులసి మెుక్కను హిందువులు దేవతగా కొలుస్తారు
  • తులసి మెుక్కకు నీరు పోసేటప్పుడు ఈ మంత్రం పఠించండి
Tulsi Vastu Tips:  తులసి చెట్టుకు నీరు పోసేటప్పుడు ఈ మంత్రం పఠిస్తే.. మీ ఇంట కనకవర్షమే..

Tulsi Vastu Tips: హిందువులు తులసి చెట్టును దేవతగా పూజిస్తారు. తులసి మెుక్కలో లక్ష్మిదేవి కొలువై ఉంటుందని వారు నమ్ముతారు.  ఇంట్లో తులసి చెట్టును (Tulsi Plant) నాటితే.. అది పాజిటివిటీని తీసుకొస్తుంది. తులసి మెుక్కను సరైన దిశలో నాటితే మీ ఇల్లు అపార సంపదతో తులతుగుతూఉంటుంది.  తులసిని ( ఎల్లప్పుడు పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. తులసి చెట్టుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు వాస్తు శాస్త్రంలో చెప్పబడ్డాయి. 

తులసి మెుక్కకి ఎప్పుడు నీరు పోయాలి?
హిందూమతం ప్రకారం, స్నానం చేసిన తర్వాత మాత్రమే తులసి మెుక్కను తాకాలి. అంతక ముందు ఏమీ తినకూడదు. సూర్యోదయ సమయంలో మాత్రమే తులసి చెట్టుకు నీరు పోయాలి. మరి ఎక్కువగా నీరు పోయకూడదు. ఆదివారం రోజున తులసి మెుక్కకు నీరు పోయకూడదు. ఎందుకంటే ఆదివారం నాడు తులసి దేవి విశ్రాంతి తీసుకుంటుందని నమ్ముతారు. ఏకాదశి నాడు కూడా తులసికి నీరు సమర్పించడం నిషేధం. 

నీరు పోసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి
తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తులసికి నీళ్లు పోసేటప్పుడు తులసి మంత్రాన్ని పఠిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా అనేక వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు. 

తులసి మంత్రం:
మహాప్రసాదం జననీ, సర్వ సౌభాగ్యవర్ధినీ
ఆది వ్యాధి హర నిత్యం, తులసీ త్వం నమోస్తుతే...

Also Read: Feng Shui: ఫెంగ్ షుయ్‌ ప్రకారం...డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే దీనిని ఇంట్లో ఉంచుకోండి! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News