JLM Exam: జూనియర్ లైన్‌మెన్ పరీక్షలో మాస్ కాపీయింగ్... పలువురు అభ్యర్థుల అరెస్ట్..

Mass Copying in JLM Exam: ఇటీవల నిర్వహించిన విద్యుత్ శాఖ జూనియర్ లైన్‌మెన్ పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 22, 2022, 09:51 AM IST
  • జూనియర్ లైన్‌మెన్ పరీక్షలో మాస్ కాపీయింగ్
  • పలువురు అభ్యర్థుల అరెస్ట్
  • నవ్య అనే యువతి కోసం పోలీసుల గాలింపు
JLM Exam: జూనియర్ లైన్‌మెన్ పరీక్షలో మాస్ కాపీయింగ్... పలువురు అభ్యర్థుల అరెస్ట్..

Mass Copying in JLM Exam: తెలంగాణ విద్యుత్ శాఖ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీఎస్ఎస్‌పీడీసీఎల్)లో జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మాస్ కాపీయింగ్‌కి పాల్పడిన పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. నవ్య అనే యువతి ఈ అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఘట్‌కేసర్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నవ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌‌లో 1000 లైన్‌మెన్ ఉద్యోగాలకు ఈ ఏడాది మే నెలలో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ  నెల 17వ తేదీన పరీక్ష జరిగింది. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాస్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి రావడం అభ్యర్థులను కలవరపెడుతోంది. ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాసిన అభ్యర్థులు మాస్ కాపీయింగ్ గురించి తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైతే ఈ వ్యవహారంపై పోలీసుల నుంచి గానీ విద్యుత్ శాఖ నుంచి గానీ ఎటువంటి ప్రకటన వెలువడలేదు. పోలీసుల దర్యాప్తులో ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

కాగా, ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. గ్రూప్ 1 సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో అభ్యర్థులు సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారు. మొత్తం 80 వేల పైచిలుకు ఉద్యోగాలను ప్రభుత్వం వివిధ దశల్లో భర్తీ చేయనుంది.

Also Read: Droupadi Murmu: బీజేపీ చాణక్యం ముందు విపక్ష కూటమి బోల్తా.. రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్...

Also Read: India Presidents:ద్రౌపది ముర్ముకు 64 శాతం ఓట్లు... ఎక్కువ ఓట్లతో రాష్ట్రపతిగా గెలిచిందో ఎవరో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News