Mouth Wash Benefits: నోటి దుర్వాసన సమస్యగా మారిందా..హోమ్‌మేడ్ మౌత్ వాష్ ఇలా తయారు చేసుకోండి

Mouth Wash Benefits: రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే మనలో కన్పించే ప్రధానమైన సమస్య నోటి దుర్వాసన. మనం గుర్తించలేకపోయినా అవతలివ్యక్తులు ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య ఎందుకొస్తుంది, ఎలా దీన్నించి ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 23, 2022, 07:39 PM IST
Mouth Wash Benefits: నోటి దుర్వాసన సమస్యగా మారిందా..హోమ్‌మేడ్ మౌత్ వాష్ ఇలా తయారు చేసుకోండి

Mouth Wash Benefits: రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే మనలో కన్పించే ప్రధానమైన సమస్య నోటి దుర్వాసన. మనం గుర్తించలేకపోయినా అవతలివ్యక్తులు ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య ఎందుకొస్తుంది, ఎలా దీన్నించి ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..

చాలామందిలో కన్పించే సమస్యే అయినా ఎవరూ గుర్తించనిది నోటి దుర్వాసన. మనకు తెలియకపోయినా..ఎదుటివ్యక్తులకు తీవ్ర అసౌకర్యం కల్గిస్తుంది. నలుగురిలో మాట్లాడేటప్పుడు ఇబ్బంది ఎదురౌతుంది. దీనికి ప్రధాన కారణంం పళ్లు, నాలుకలో పేరుకున్న వ్యర్ధాలే. మార్కెట్‌లో లభించే టూస్ పేస్టుల కంటే హోమ్‌మేడ్ టూత్ పేస్టులే అద్భుతంగా పనిచేస్తాయి.

చాలామంది బాహ్య శుభ్రతకు అంటే స్నానం ప్రతి నిత్యం చేసి బయటకు అందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు, కన్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే నోటి శుభ్రతకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. బ్రష్ చేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ బ్రష్ చేయడం వల్ల నోరు శుభ్రం కానేకాదు. ఫలితంగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు భరించలేని దుర్వాసన వస్తుంటుంది. నోటి దుర్వాసన నుంచి ఉపశమనం పొందేందుకు మౌత్ వాష్ ఒక్కటే పరిష్కారం. దీనికోసం మార్కెట్‌లో లభించే వివిధ రకాల మౌత్ వాష్‌లు అవసరం లేదు. ఇంట్లోనే వంటింటి చిట్కాలతో మౌత్ వాష్ తయారు చేసుకోవచ్చు. మౌత్ వాష్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మౌత్ వాష్ తయారీ ఇలా

ఇంట్లోనే సహజసిద్ధమైన పద్ధతిలో మౌత్ వాష్ తయారుచేసేందుకు ఒక కప్పు అల్లోవెరా జ్యూస్, నీరు , 2-3 లవంగాలు అవసరమౌతాయి. ముందుగా నీళ్లలో అల్లోవెరా జ్యూస్ కలిపి కాస్సేపు అలానే ఉంచాలి. దాదాపు 20-25 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో తీసుకుని అందులో 2-3 లవంగాలు వేయాలి. అంతే మీ మౌత్ వాష్ తయారైనట్టే. ప్రతిరోజూ బ్రష్ చేసిన తరువాత ఈ హోమ్‌మేడ్ మౌత్ వాష్ చేస్తుంటే మంచి ఫలితాలుంటాయి.

మౌత్ వాష్‌తో లాభాలు

మౌత్ వాష్ చేయడం వల్ల పళ్లలో దుర్వాసన పోవడమే కాకుండా నాలుకపై ఉన్న వ్యర్ధం కూడా తొలగిపోతుంది. హోమ్‌మేడ్ మౌత్ వాష్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కోలిన్ బి1, కోలిన్ బి2 లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పళ్లు దుర్వాసనను పోగొడతాయి. మీ నోరు దుర్వాసన లేకుండా ఉండాలంటే రోజూ క్రమం తప్పకుండా మౌత్ వాష్ తప్పనిసరి.

Also read: Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో చెప్పే 5 లక్షణాలు, తస్మాత్ జాగ్రత్త

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News