కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, భారత ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. "మోదీగారు..! కర్ణాటకలో మీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప సాధించిన విజయాలేమిటో 15 నిముషాలు మాట్లాడండి. పేపర్ చూసి మాట్లాడినా చాలు.." అని ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్‌ని ఆయన ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. ఇటీవలే మోదీ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలో కాంగ్రెస్ ఏ విజయాలు సాధించిందో చెబుతూ.. పేపర్ చూడకుండా ఏ భాషలోనైనా రాహుల్ మాట్లాడాలని మోదీ తెలిపారు. చామరాజనగర్ ప్రాంతంలో మోదీ ఎన్నికల ర్యాలీ చేస్తున్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. 15 నిముషాలు సమయం కేటాయిస్తే.. బీజేపీ ఎలాంటి అవినీతి పనులు చేసిందో తాను పార్లమెంటులో చెప్పగలనని.. కానీ అన్ని నిముషాలు వినే ఓపిక మోదీకే ఉండడం లేదని రాహుల్ చేసిన మాటలకు ప్రతిగా మోదీ ఈ మాటలు అన్నారు
"రాహుల్ 15 నిముషాలు మాట్లాడడం అనేది చాలా పెద్ద విషయమే. నేను అన్ని నిముషాలు కూర్చొని వినకపోవడం కూడా పెద్ద విషయమే. ఎందుకంటే మేం ఆయనంత పేరు ప్రఖ్యాతులు కలిగినవాళ్లం కాదు. మేం చాలా సామాన్యులమైన మనుష్యులం. ఆయన ముందు అంతసేపు కూర్చొని మాట్లాడే అర్హత మాకు ఉందా..?" అని మోదీ ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు మోదీ మాటలపై మండిపడ్డారు. రాహుల్ చెప్పినదానికి సమాధానం చెప్పలేకే మోదీ ప్రశ్నను దాటవేస్తున్నారని అన్నారు.
Dear PM @narendramodi ji,
I challenge you to speak about the achievements of B S Yeddyurappa’s Govt in Karnataka for 15 minutes by looking at a paper.
Sincerely
Siddaramaiah https://t.co/zSkja6eURO— Siddaramaiah (@siddaramaiah) May 2, 2018