High Cholesterol Control In 10 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు గుండె సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చాలా మందిలో అనారోగ్యకరమైన ఆహారం, చెడు జీవన శైలికారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చాలా మందిత ఊబకాయం వంటి సమస్యల బారిన పడడం విశేషం. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. వీటి వల్ల అన్ని రకాల సమస్యల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజూ అరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఆహారాల్లో వీటిని చేర్చుకోవాలి:
గ్రీన్ టీ తీసుకోవాలి:
గ్రీన్‌లో చాలా రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించేందుకు కృషి చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి క్రమం తప్పకుండా గ్రీన్ టీని తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రీన్ టీలో పాలు కలుపుకుని తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి.
ఓట్స్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలు:
ఓట్స్‌లో బీటా గ్లూటెన్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు సహాయపడుతుంది. కావున బరువును నియంత్రించుకోవాలనుకునే వారు క్రమం తప్పకుండా ఓట్స్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
టమోటో రసం:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి టమోటా రసం ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. టమోటాలలో లైకోపీన్ సమ్మేళనం అధిక పరిమాణంలో ఉంటుంది. కావున చెడు కొవ్వును తగ్గించడానికి కృషి చేస్తుంది.
బ్లూబెర్రీస్:
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ శాతం పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి పని చేస్తాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook