Cash In MLAS Car: పశ్చిమ బెంగాల్ కు చెందిన మాజీ మంచ్రి పార్థా చటర్టీ ఇంట్లో ఇటీవలే కరెన్సీ నోట్ల కట్టలు బయపడ్డాయి. టీచర్ నియామక కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జరిగిన సోదాల్లో పార్థా ఛటర్జీకి చెందినదిగా భావిస్తున్న 50 కోట్ల నగదు దొరికింది. ఆ డబ్బంతా మాజీ మంత్రి నివాసంలో గుట్టలుగుట్టలుగా ఉండటం చూసి ఈడీ అధికారులు షాకయ్యారు. బెంగాల్ డబ్బుల ఘటన మరవకముందే మరోసారి భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. పశ్చిమ బెంగాల్ కు పక్కనే ఉన్న జార్ఘండ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారులో భారీగా నగదు దొరకడం కలకలం రేపుతోంది.
బెంగాల్‌లోని హౌరా జిల్లాలో తనిఖీలు చేపట్టిన పోలీసులు అటుగా వస్తున్న కార్లను ఆపారు. వాటిలో తనిఖీలు చేయగా.. ఓ కారులో పెద్ద మొత్తంలో నగదు కనిపించింది. భారీగా కరెన్సీ కట్టలు బయటపడిన కార్లు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్ కొంగరివిగా గుర్తించారు. వీళ్లంతా ఒక ఎస్‌యూవీ వాహనంలో పశ్చిమ బెంగాల్ నుంచి వస్తుండగా.. రాణిహటి వద్ద జాతీయ రహదారిపై తనిఖీలు చేయగా ఈ వ్యవహారం బయటపడింది.కారులో దొరిగిన డబ్బును పోలీసులు లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 50 లక్షల పైగా నగదును లెక్కించామని.. డబ్బు లెక్కింపు మిషన్ తో ఇంకా లెక్కిస్తున్నామని హౌరా రూరల్ ఎస్పీ స్వాతి చెప్పారు. నల్ల కారులో పెద్ద మొత్తంలో నగదు రవాణా అవుతుందని తమకు సమాచారం రావడంతో తనిఖీలు చేశామని ఆమె తెలిపారు. కరెన్సీ కట్టల గురించి కారులో ఉన్న ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నామని తెలిపారు. నగదు పట్టుబడిన కారులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న కారులో భారీగా నగదు దొరికిన ఘటన పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. జార్ఖండ్ లో ప్రస్తుతం జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ ఉంది. జార్ఖండ్ లోని హేమంత్ సర్కార్ కూలిపోతుందనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారులో నగదు పట్టుబడటంతో టీఎంసీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. జేఎంఎం ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బేరసారాలు జరుగుతున్నాయని ఆరోపించింది.
UTTERLY SHOCKING!
Huge amounts of cash recovered from a car of @INCIndia MLA from Jharkhand - intercepted at Howrah.
Apparently, 3 INC MLAs were travelling in the car.
Is ED going after only a select few? https://t.co/adUUhW5txr
— All India Trinamool Congress (@AITCofficial) July 30, 2022
ఈ ఘటన సంకీర్ణ కూటమిలోనే సెగలు రేపుతోంది. ఎమ్మెల్యేల వద్ద పట్టుబడ్డ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని అధికార జేఎంఎం డిమాండ్ చేసింది. బీజేపీ కూడా ఇదే డిమాండ్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీజేపీని టార్గెట్ చేసింది. హేమంత్ సొరెన్ సర్కార్ ను పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. నగదుతో పట్టుబడిన ముగ్గురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకమాండ్ కు సిఫారస్ చేశామని జార్ఖండ్ పీసీసీ చీఫ్ బంధు టిర్కే తెలిపారు.
Read also: Komatireddy:మునుగోడులో కోమటిరెడ్డి ఒంటరయ్యారా? అందుకే రాజీనామాకు భయపడుతున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook