Cholesterol Control Foods: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా అధికమే..! అయితే శరీరంలో చెడు కొవ్వు పెరిగినప్పుడు తీసుకునే ఆహారంలో పాలు, కొవ్వు పదార్థాలు, గుడ్లు పూర్తిగా తీసుకొకూడదా..? అనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. అయితే శరీరంలో చెడు కొవ్వులను నియంత్రించేందుకు ఆహారపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరమని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం పాలు, కొవ్వు పదార్థాలను తక్కువ పరిమాణంలో తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలతో బాధపడుతున్న వారు కచ్చితంగా ఫుడ్ డైట్‌ను ఫాలో అవ్వాలి. అయితే డైట్‌లో ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో కొలెస్ట్రాల్ చేసే పనులు ఇవే:
>>మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించేందుకు కృషి చేస్తుంది.
>>శరీరంలో కణాలను బయటి పొరను తయారు చేస్తుంది.
>>ఆహారాన్ని జీర్ణం చేయడానికి.. పిత్త ఆమ్లాలను తయారు చేస్తుంది.
>>విటమిన్ డి, హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
కొలెస్ట్రాల్‌ను పెంచే మూలకాలు ఇవే:
>>సంతృప్త కొవ్వు
>>ట్రాన్స్ కొవ్వు
>>కొలెస్ట్రాల్
>>పాల ఉత్పత్తులు, కొలెస్ట్రాల్ పదార్థాలు
పాల ఉత్పత్తులలో చాలా రకాల పోషకాలుంటాయి. ఇవి శరీరంలో ఎముకలను బలోపేతం చేసేందకు కృషి చేస్తాయి. అంతేకాకుండా ఇందులో కాల్షియం, పొటాషియం, విటమిన్ డి ఉంటాయి. వీటి వల్ల శరీరంలో LDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు ఇవే:
>>వెన్న తీసిన పాలు
>>కాటేజ్ చీజ్, పార్ట్-స్కిమ్ మిల్క్
>>కొలెస్ట్రాల్ లెస్‌పెరుగు, ఐస్ క్రీం
వీటి వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది:
>>ఓట్స్
>>వాల్‌నట్స్
>>ఆలివ్ ఆయిల్
>>నిమ్మకాయ
>>ఉల్లిపాయలు
>>వెల్లుల్లి
>>ఉడికించిన చేపలు
>>డార్క్ చాక్లెట్
>>అజ్వైన్
>>ఖర్జూరం
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook