Nirmala Mishra Passes Away: సినీ పరిశ్రమలో మళ్లీ విషాదం నెలకొంది. ఈ మధ్య కాలంలో అనారోగ్య కారణాలతో పలువురు సినీ సెలబ్రిటీలు మృతి చెందగా తాజాగా ప్రముఖ బెంగాలీ గాయని నిర్మలా మిశ్రా శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 81 సంవత్సరాలు. గత కొన్నాళ్ల నుంచి నిర్మలా మిశ్రా తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతోంది. దక్షిణ కోల్‌కతాలోని చెట్లా ప్రాంతంలోని తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు.
నిర్మలా మిశ్రా తన సుదీర్ఘ కెరియర్లో అనేక బెంగాలీ సహా ఒరియా చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. కొంతకాలంగా నిర్మలా మిశ్రా వయో సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు ఆమెకు గుండెపోటు వచ్చిందని, వెంటనే సమీపంలో నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లామని, అయితే తీసుకు వెళ్లే సమయానికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని కుటుంబ సభ్యులు. ఆమె భౌతికకాయాన్ని ఉదయం 11 గంటలకు రవీంద్ర సదన్‌కు తీసుకు వెళ్లగా అక్కడే ఆమె అభిమానులు తుది నివాళులు అర్పిస్తున్నారు.
ఇక గాయని మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు . పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 1938లో జన్మించిన నిర్మలా మిశ్రా సంగీత్ సుధాకర్ బాలకృష్ణ దాస్ అవార్డు గ్రహీత కూడా. ఒరియా సంగీతానికి ఆమె చేసిన జీవితకాల కృషికి గానూ ఈ పురస్కారం లభించింది. ఆమె పడిన బెంగాలీ పాటల్లో 'ఎమోన్ ఏక్తా జినుక్', 'బోలో తో అర్షి' అలాగే ‘ఇ బంగ్లార్ మతి చాయ్' సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఒడియాలో 'నిదా భార రాతి మధు ఝరా జన్హా' మరియు 'మో మన్ బినా రా తారే' వంటి సాంగ్స్ హిట్ అయ్యాయి.
Also Read: Shootings Bundh: షూటింగ్స్ బంద్ ఖాయం..ప్రకటించిన ఫిలిం ఛాంబర్.. మళ్లీ అప్పటి నుంచే!
Also Read: Commitment: క్షమాపణలు చెప్పిన కమిట్మెంట్ డైరెక్టర్.. తానూ హిందువునే అంటూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook