Putrada Ekadashi 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి. ఏడాది మెుత్తంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఈ ఏకాదశుల్లో పుత్రదా ఏకాదశికి (Putrada Ekadashi 2022) చాలా ప్రత్యేకత ఉంది. దీనిని శ్రావణ మాసంలో శుక్లపక్షం ఐదో రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది పుత్రదా ఏకాదశి 8 ఆగస్టు, 2022న వస్తుంది. సంతానం లేని దంపతులు ఈ ఏకాదశి వ్రతం చేస్తే..పిల్లలు పుడతారని నమ్ముతారు.
శుభ ముహూర్తం
పుత్రదా ఏకాదశి 7 ఆగస్టు 2022, ఆదివారం రాత్రి 11:50 గంటలకు ప్రారంభమై.... 8 ఆగస్టు 2022, సోమవారం రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, పుత్రదా ఏకాదశి వ్రతం ఆగస్టు 8న జరుపుకోనున్నారు.
పుత్రదా ఏకాదశి పూజ
సంతాన ప్రాప్తి కోసం దంపతులు ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఉపవాస దీక్షను తీసుకోవాలి. అనంతరం పూజ ప్రారంభించాలి. ఇందులో విష్ణువు విగ్రహాన్ని లేదా ఫోటోను ప్రతిష్టంచండి. దాని ముందు కలశాన్ని ఉంచి..దానికి ఎర్రటి వస్త్రం చుట్టండి. తర్వాత నెయ్యితో దీపం వెలిగించి..శ్రీమహావిష్ణువును పూజించండి. పూజలో పూలు, కొబ్బరికాయ, తమలపాకులు, లవంగం, జామకాయ మొదలైన వాటిని ఉంచండి. అలాగే పండ్లు, మిఠాయిలు నైవేద్యంగా పెట్టండి. ఏకాదశి నాడు జాగరణ చేయాలి. చివరగా పుత్రదా ఏకాదశి కథ చదివి.. హారతి ఇవ్వండి.
Also Read: Astro Tips: ఈ 5 చెట్లను పూజిస్తే.. మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook