JEE Main Result 2022: జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల... విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు,ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకై నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) సెషన్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం (ఆగస్టు 8) ఫలితాలు విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను అందుబాటులో ఉంచారు. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 8, 2022, 05:08 PM IST
  • విడుదలైన జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు
  • ఫలితాల లింక్‌ను యాక్టివేట్ చేసిన ఎన్‌టీఏ
  • ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే...
JEE Main Result 2022: జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల... విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

JEE Main Result 2022: దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు,ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకై నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) సెషన్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం (ఆగస్టు 8) ఫలితాలు విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను అందుబాటులో ఉంచారు. 

జేఈఈ ఫలితాలు ఈ వెబ్‌సైట్స్‌లో :

jeemain.nta.nic.in
ntaresults.nic.in 
www.nta.ac.in 

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి :

మొదట jeemain.nta.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోం పేజీలో 'జేఈఈ మెయిన్ సెషన్ 2 రిజల్ట్స్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి సబ్‌మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
అంతే.. స్క్రీన్‌పై మీ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.
స్కోర్ కార్డును ప్రింటవుట్ తీసి ఉంచుకోవాలి.

ఈసారి కటాఫ్ అంచనాలు :

జనరల్ అభ్యర్థులకు 87.89
ఈడబ్ల్యూఎస్ 66.22
ఎస్సీలకు 46.88
ఎస్టీలకు 34.67

ఈసారి జేఈఈ పరీక్షను ఎన్‌టీఏ రెండు సెషన్లలో నిర్వహించింది. మొదటి సెషన్ జూన్ 23 నుంచి జూన్ 29 వరకు జరిగింది. ఈ సెషన్ ఫలితాలను జూలై 12న విడుదల చేశారు. మొదటి సెషన్‌కు మొత్తం 8,72,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక రెండో సెషన్ జూలై 25 నుంచి జూలై 30 వరకు నిర్వహించారు. ఈ సెషన్‌కు 6,29,778 మంది హాజరయ్యారు. విద్యార్థులు రెండు సెషన్లకు హాజరయ్యే అవకాశం కల్పించారు. రెండింటిలో బెస్ట్‌ మార్క్స్‌ను మెరిట్‌గా పరిగణిస్తారు. జేఈఈ మెయిన్స్‌ ద్వారా 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్‌కు అర్హత సాధిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ ఆగస్టు 28న జరగనుంది.

Also Read: Horoscope Today August 8th : నేటి రాశి ఫలాలు.. ప్రేమలో ఉన్న ఈ రాశి వారిని ఇబ్బందులు చుట్టుముడుతాయి..

Also Read: KomatiReddy Rajgopal Reddy Live Updates: ఇవాళ స్పీకర్ కు కోమటిరెడ్డి రాజీనామా.. ఉప ఎన్నిక డేట్ ఫిక్స్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News