TRS MLC Kavitha: ఉచిత హామీలపై కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన కవిత

TRS MLC Kavitha On Freebies : హైదరాబాద్: ఉచితాలు అందించే పథకాలను ఇకనైనా ఆపేయాలని ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.

Written by - Pavan | Last Updated : Aug 9, 2022, 06:00 PM IST
  • సంక్షేమ పథకాలు ఆపేందుకు కేంద్రం కుట్రలు
  • అందుకు కోర్టుల సహాయం తీసుకుంటున్న మోదీ సర్కారు
  • ఉచిత హామీలపై కేంద్రం వైఖరిని తప్పుపట్టిన కవిత
TRS MLC Kavitha: ఉచిత హామీలపై కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన కవిత

TRS MLC Kavitha On Freebies : హైదరాబాద్: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన బడాబడా వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. పేదల కోసం అందించే సంక్షేమ పథకాలను ఉచితాల పేరుతో అపాలనుకోవడం దారుణం అని అన్నారు. ఉచితాలు వేరు.. సంక్షేమ పథకాలు వేరు అని అభిప్రాయపడిన కవిత.. పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు ఎంతో అవసరం అని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు ఆపేందుకు కుట్ర చేస్తూ అందుకు కోర్టుల సహాయం కూడా తీసుకుంటున్న మోదీ సర్కారు తీరు సరికాదని హితవు పలికిన కవిత.. ఈ విషయంలో దేశ పౌరులందరూ కేంద్రం తీరును వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ సర్కారు నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని గుర్తుచేసిన ఆమె.. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు తీసుకొచ్చామని స్పష్టంచేశారు. 

తెలంగాణలో ఇప్పటికే 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తుండగా.. త్వరలోనే మరో 10 లక్షల మందికి పెన్షన్ మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవలే అధికారిక ప్రకటన చేశారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. 65 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇవ్వడంతో పాటు వివిధ రంగాలకు చెందిన పేదలకు ప్రయోజనం చేకూరేలా తెలంగాణ సర్కారు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. అంతేకాకుండా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను ఆదర్శంగా తీసుకుని వేరే రాష్ట్రాలు కూడా వారి వారి రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలను అమలు  చేస్తున్నాయని కవిత తెలిపారు. 

కేంద్రం చెబుతున్నట్టుగా రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు పథకం ఆపుకోవాలా, నిరుపేద విద్యార్థులకు అందించే గురుకుల విద్యను ఆపుకోవాలా ? లేక చేపలు, గొర్రెల పంపకం ఆపుకోవాలా.. ఆసరా పెన్షన్లు ఆపేయాలా ? ఇందులో ఏం చేయాలి అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి’ అని ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉచిత హామీలు మానుకోవాలని కేంద్రం హితవు పలకడాన్ని కవిత ప్రస్తావిస్తూ.. పేద ప్రజలను పేదరికం నుండి బయటపడేసేందుకు ప్రభుత్వం చేసే సహాయాన్ని ఉచితాలుగా ఎలా పరిగణిస్తారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. పేదల కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను, ఉచితాలను వేర్వేరుగా చూడాలని బీజేపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత (TRS MLC Kalvakuntla Kavitha) విజ్ఞప్తిచేశారు.

Also Read : TS Eamcet 2022 Result: తెలంగాణ ఎంసెట్ ఫలితాలపై విద్యార్థులకు కీలక అప్‌డేట్...

Also Read : Rajagopal Reddy Meets Bandi Sanjay : బీజేపీలో రాజగోపాల్‌రెడ్డి ఇమడగల్గుతారా..బండి సంజయ్‌తో భేటీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News