Gorantla Madhav: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. న్యూడ్ వీడియోకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికను అనంతపురం జిల్లా పోలీసులు బయటపెట్టారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫేక్ అని చెప్పారు ఎస్పీ ఫకీరప్ప. ఆ వీడియోను మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండవచ్చన్నారు.