MS Dhoni Pandit Avatar: ఎంఎస్ ధోనీ సరికొత్త అవతారం.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటో! పోలా అదిరిపోలా

MS Dhoni Pandit Avatar Images Goes Viral. ఎంఎస్ ధోనీకి సంబంధించిన కొత్త లుక్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 11, 2022, 08:19 AM IST
  • ఎంఎస్ ధోనీ సరికొత్త అవతారం
  • సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటో
  • ధోనీ సరికొత్త అవతారం పోలా అదిరిపోలా
MS Dhoni Pandit Avatar: ఎంఎస్ ధోనీ సరికొత్త అవతారం.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటో! పోలా అదిరిపోలా

MS Dhoni Pandit Avatar Images Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌‌గా ఉండరు అన్న విషయం తెలిసిందే. అయినా కూడా ఆయన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఇందుకు కారణం మహీ సతీమణి సాక్షి సింగ్ ధోనీ లేదా ఆయన ఫాన్స్. మహీకి సంబందించిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను సాక్షి చూసుకుంటారన్న విషయం తెలిసిందే. సాక్షి నుంచి లేదంటే ధోనీ ఫాన్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పుడూ బయటికి వస్తుంది. తాజాగా ఆయన ఫొటోస్ ఇలానే వైరల్ అయ్యాయి. 

ఎంఎస్ ధోనీకి సంబంధించిన కొత్త లుక్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 'ఇసికామహి' (isikamahi) అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ధోనీ కొత్త లుక్ ఫొటోస్ పోస్ట్ చేయబడ్డాయి. ఆ ఫోటోలలో ధోనీ పండితుడి వేషధారణలో కనిపిస్తున్నారు. మహీ పసుపు రంగు కుర్తా ధరించి చేతికి దండ వేసుకున్నారు. ఓ ఫొటోలో సంస్కారం చేస్తుండగా.. ఇంకో ఫొటోలో ఉపదేశం చేస్తున్నట్లు ఉన్నారు. ఈ ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 

క్రికెట్ ప్రపంచంలో తనదైన సారథ్యంతో గొప్ప కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోనీ.. ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఘనతను తన పేరుపై లిఖించున్నారు. టీ20 ప్రపంచకప్ 2007ను టీమిండియాకు అందించిన ధోనీ.. మూడు దశాబ్దాలుగా ఊరించిన వన్డే ప్రపంచకప్‌ను 2011లో అందించారు. ఇక 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచి.. ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచారు. మూడు ఐసీసీ టైటిల్స్ ఇప్పటికీ ఎవరూ గెలవలేదు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Isika Mahi (@isikamahi)

టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ 2020 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పారు. అంతర్జాతీయ కెరీర్‌లో మహీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్‌ బాదారు. వీటిల్లో 10 సెంచరీలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 183‌. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1,617 పరుగుల చేశారు. ఐపీఎల్ టోర్నీలో 234 మ్యాచులు ఆడిన ధోనీ 4,978 రన్స్ బాదారు.

Also Read: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే

Also Read: Horoscope Today 11 August 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల ప్రేమికులు విజయం సాధిస్తారు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News