Kidney Stone: వయసు పెరిగే కొద్దీ శరీరంలో చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా చాలా మందిలో కిడ్నీ సమస్యలు రావడం. అయితే ఇటీవలే పలు నివేదికలు తెలిపిన సమాచారం అందరినీ బయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా అనారోగ్యమైన ఆహారాలను తీసుకోవడం వల్ల కిడ్నీ చెడి పోతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి జీవన శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఆహార నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయో.. మనం ఇప్పుడు తెలసుకుందాం..
కాల్షియం అధికంగా ఉండే కూరగాయలను తీసుకోవాలి:
ప్రస్తుతం చాలా మంది కిడ్నీ స్టోన్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. చాలా రకాల మందులను వినియోగించిన ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. ఈ స్టోన్స్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి క్యాల్షియం ఎక్కువగా ఉండే కూరగాయలను తినాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల్లో రాళ్లను నియంత్రిస్తుంది.
ఈ కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి:
<<బ్రోకలీ
<<క్యాప్సికమ్స్
<<అరటిపండు
<<బఠానీలు, బీన్స్
<<నిమ్మకాయ
కిడ్నీల్లో స్టోన్ ఉన్నవారు అస్సలు వీటిని తినకూడదు.
విత్తనాలు ఉన్న ఆ కూరగాయలను అస్సలు తినకూడదు. అంతేకాకుండా దీనిలో సోడియం అధిక పరిమాణంలో ఉంటుంది. కావున వీటిని తినపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా , శీతల పానీయాలు, చాక్లెట్, టీ వంటి వాటిని తీసుకోవడం కూడా చాలా ప్రమాదం. కావున ఈ ఆహారపు అలవాట్లు ఉంటే కచ్చితంగా మానుకోండి.
<<పాలకూర
<<టమోటా
<<దోసకాయ
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook