Mahesh Babu: కొత్త లుక్ లో మెరిసిపోతున్న మహేష్ బాబు.. ఫోటో చూశారా?

Mahesh Babu New Look Viral In Social Media:మహేష్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వెంటనే వైరల్ అవుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2022, 11:52 AM IST
  • కొత్త లుక్ లో ఫోటో షేర్ చేసిన మహేష్
  • ట్విట్టర్లో వైరల్ గా మారిన ఫోటో
  • సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు
 Mahesh Babu: కొత్త లుక్ లో మెరిసిపోతున్న మహేష్ బాబు.. ఫోటో చూశారా?

Mahesh Babu New Look Viral In Social Media: సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఆయన చేస్తున్న మంచి పనులకు కూడా అనేకమంది అభిమానులుగా మారిపోతున్నారు. ఇటీవల సర్కారు వారి పాట అనే సినిమాతో హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ మధ్యనే తన పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా జరుపుకున్న మహేష్ బాబు సోషల్ మీడియాలో తన కొత్త లుక్ కి సంబంధించిన ఒక ఫోటో షేర్ చేశారు. ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న క్రమంలో ఆ సినిమా కోసం ఇలా సిద్ధమయ్యారు అనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ మధ్యనే ఒక యాడ్ షూట్ లో ఉన్నప్పటి ఫోటోని నమ్రత శిరోద్కర్ షేర్ చేయగా అది సోషల్ మీడియాను షేక్ చేసింది.

ఇప్పుడు మహేష్ బాబు తన సరికొత్త లుక్ కి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. లవింగ్ ద న్యూ వైబ్ అంటూ ఆయన క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ ఫోటోకు మహేష్ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తూ అదిరిపోయారు బాస్ అంటూ పొంగిపోతున్నారు.

ఇక ఈ నెలలోనే త్రివిక్రమ్,  మహేష్ బాబు సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని గత నెలలోనే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఎప్పుడు ప్రారంభం కాబోతోంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది. ఇక గతంలో అతడు,  ఖలేజా వంటి సినిమాలు కలిసి చేసిన మహేష్ బాబు,  త్రివిక్రమ్ ఈ సినిమా కోసం మళ్ళీ కలిసి పని చేయబోతున్న నేపథ్యంలో సినిమా మీద భార్య అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఇక ఈ లుక్ సినిమా కోసమేనా? లేక వేరే ఏదైనా యాడ్ షూట్ కోసమా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఇక త్రివిక్రమ్ తో సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలోకి సినిమా చేయాల్సి ఉంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 

Also Read: NBK 107: అన్ని సినిమాలు ఉన్నా సంక్రాంతి బరిలో బాలయ్య.. టైటిల్ అదేనా?

Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News