Bahul Chaturthi 2022: భాద్రమాసం ఇప్పటికే మెుదలైంది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో బహుళ చతుర్థి (Bahul Chaturthi 2022) ఒకటి. ఇది ఆగస్టు 15న అంటే ఇవాళే వచ్చింది. ఇదే రోజు హీరాంబ సంకష్టి చతుర్థి రావడం విశేషం. భాద్రపద కృష్ణ చతుర్థి తిథినే బహుళ చతుర్థి అంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడిని, గోవును పూజిస్తారు. సంకష్టి చతుర్థి వ్రతం పాటించేవారు గణేశుడిని (Lord Ganesha) పూజిస్తారు. ఇద్దరి దేవతలు అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. బహుళ చతుర్థి మరియు హీరాంబ సంకష్ట చతుర్థి వ్రత ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
శుభ ముహూర్తం
కృష్ణ పక్ష చతుర్థి తిథి ప్రారంభం: ఆగష్టు 14, ఆదివారం, రాత్రి 10.35 నుండి
కృష్ణ పక్ష చతుర్థి తిథి ముగింపు: ఆగష్టు 15, సోమవారం, రాత్రి 09:01 గంటలకు
ధృతి యోగం: ఉదయం నుండి 11.24 వరకు
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 11:59 నుండి 12.52 వరకు
చంద్రోదయం సమయం: రాత్రి 09:27
చంద్రుడు అస్తమించే సమయం: ఆగస్టు 16, ఉదయం 09:04 గంటలకు
బహుళ చతుర్థి పూజా విధానం
ఈ రోజున ఉదయం స్నానం చేసి ఉపవాసాన్ని పాటిస్తూ...శుభ ముహూర్తంలో శ్రీకృష్ణుడిని మరియు ఆవును పూజించాలి. వీరిని పువ్వులు, పండ్లు, ధూపం, దీపం మొదలైన వాటితో పూజించాలి. ఆ తర్వాత బహుళ చతుర్థి వ్రతం కథ వినండి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు.
సంకష్టి చతుర్థి పూజా విధానం
సంకష్ట చతుర్థి నాడు ఉపవాసం ఉన్నవారు గణేశుడిని ఎర్రటి పుష్పాలు, దుర్వ, అక్షత, కుంకుమ, చందనం, ధూపం, దీపం మొదలైన వాటితో పూజించాలి. అంతేకాకుండా గణపతికి లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి. అనంతరం గణేష్ చాలీసా మరియు సంకష్తి చతుర్థి ఉపవాస కథను పఠించండి. ఆ తర్వాత నెయ్యి దీపంతో గణేశుడికి హారతి ఇవ్వండి. రాత్రి చంద్రుడు ఉదయించినప్పుడు నీటితో అర్ఘ్యం సమర్పించండి. చంద్రుని పూజించిన తర్వాత పారణ చేస్తూ ఉపవాసం పూర్తి చేయండి.
Also Read: Sun Transit Effect: సూర్యుడి సింహరాశి ప్రవేశం కుంభరాశివారిపై ఎలా ఉంటుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook