TSLPRB Constable Hall Ticket 2022: తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్ష ఈనెల 28న జరగనుంది. ఈనేపథ్యంలో ఇవాళ్టి నుంచి అభ్యర్థులకు హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈ విషయాన్ని పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.వి శ్రీనివాసరావు ప్రకటించారు. నేటి నుంచి ఈనెల 26 వరకు హాల్ టికెట్లను పొందవచ్చు. పోలీస్ శాఖలో 15 వేల 644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
వీటికి ఈనెల 28న రాత పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్షకు ఆరు లక్షల 61 వేల 196 మంది అభ్యర్థులు హాజరవుతారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 16 వందల 1 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో అవాంతరాలు ఎదురైతే support@tslprb.inకు మెయల్ చేయాలని లేదా 9393711110, 93911005006 నెంబర్లకు ఫోన్ చేయాలని పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.వి శ్రీనివాసరావు తెలిపారు.
అభ్యర్థులకు కీలక సూచనలు..
* అభ్యర్థులంతా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను పరీక్షా కేంద్రానికి రావాలి.
* హాల్ టికెట్ వెనుక భాగంలో ఉన్న నిబంధనలను సైతం తీసుకురావాలి.
* దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫోటోనే హాల్ టికెట్‌పై ఉంచాలి..వేరే ఫోటోను అతికించినా..హాల్ టికెట్ సమగ్రంగా లేకపోయినా పరీక్షా కేంద్రంలోకి అనుతించరు.
* ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి నో ఎంట్రీ
* పరీక్షా కేంద్రంలో అభ్యర్థుల డిజిటల్ వేలిముద్రను అధికారులు తీసుకుంటారు.
* హాల్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతి ఉండదు.
* హాల్ టికెట్‌ను నియామక ప్రక్రియ పూర్తైత వరకు భద్రతంగా ఉంచుకోవాలి.
తెలంగాణలో కానిస్టేబుల్ పరీక్ష వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ఈనెల 21న పరీక్ష జరగాల్సి ఉంది. ఐతే కొన్ని కారణాలతో ఈనెల 28కు వాయిదా వేశారు. ఈ విషయాన్ని పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.వి శ్రీనివాసరావు అధికారికంగా వెల్లడించారు. ఎస్సై రాత పరీక్ష ఈనెల 7న ముగిసింది.
Also read:Stock Markets: స్టాక్‌మార్కెట్లలో లాభాలు ఆర్జించాలనుకుంటున్నారా..అయితే ఇలా చేయండి..!
Also read:Amaravathi Rythulu: మహా పాదయాత్రకు సిద్ధమవుతున్న అమరావతి రైతులు..ఎప్పటి నుంచి అంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook