Stock Markets: స్టాక్ మార్కెట్లలో కొందరు సక్సెస్ అయితే..మరికొందరూ నష్టపోతుంటారు. ఇందుకు కారణం వారు అనుసరించే వ్యూహాలేనని నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్లలో విజయం సాధించేందుకు ఎన్నో మార్గాలు, వ్యూహాలు ఉన్నాయి. సూచీలు మంచి జోష్‌లో ఉన్న సమయంలో ప్యాసిన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంచుకోవడం ద్వారా రాబడిని ఆర్జించే వారు చాలా మంది ఉన్నారు. ఇందుకు ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు, ఇండెక్స్ ఫండ్లను పరిశీలిస్తుంటారు.
ఇప్పుడు వీటికి మరింత బూస్ట్ అందించేందుకు ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పనికి వస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు మార్కెట్లలో ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా భారత్‌లోనూ ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. పెట్టుబడి ప్రధాన లక్ష్యంగా..మంచి రాబడి సాధించేందుకు ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ బూస్ట్ ఇస్తుంది. మెరుగైన రాబడిని అందించే పెట్టుబడుల ఎంపికకు ఇది ఉపయోగపడుతుంది.
ఫండమెంటల్ ఆధారంగా షేర్లను ఎంపిక చేసుకోవడం ఓ విధానమైతే..షేర్ల ధరలను ఆధారంగా వాటి గమనాన్ని అర్థం చేసుకోవడం మరో పద్దతి. ధరల కదలికలు, తక్కువ హెచ్చుతగ్గులు, డివిడెండు చెల్లింపు, విలువలు పేరు వంటి ఇతర అంశాలు షేర్ల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తాయి. కొన్ని అంశాల ప్రాతిపదికన, షేర్ల ఎంపిక ఉంటుంది. విలువ ఆధారంగా కంపెనీలను ఎంచుకుని..వాటిలో మదుపు చేయవచ్చు.
నిఫ్టీ 50, నిఫ్టీ 500 ఇండెక్స్ నుంచి షేర్లను ఎంపిక ఉంటుంది. నిఫ్టీ 50లో మంచి రాబడినిచ్చే 20 కంపెనీలతో పెట్టుబడుల జాబితా సిద్ధమవుతుంది. వీటిలో పెట్టుబడిపై వస్తున్న రాబడి, షేర్లు ఆర్జిస్తున్న ఆదాయం, పుస్తక విలువ, డివిడెండ్ రాబడి ఇలా కొన్ని ప్రాథమిక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అందరూ పాటించే ఫార్ములాలతో షేర్లను ఎంపిక చేసుకుని..పెట్టుబడులు కొనసాగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల లాభాలు రావొచ్చు..నష్టాలు రావొచ్చు.
దేశీయ స్టాక్‌మార్కెట్లలో మార్కెట్ పరిస్థితులు మెరుగ్గా ఉండే షేర్లన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి. అదే సమయంలో మరికొన్ని నేలచూపులు చూస్తాయి. అందుకే మార్కెట్లలో ఒకే వ్యూహాం కాకుండా బహుళ వ్యూహాలు రచించాలంటున్నారు మార్కెట్ నిపుణులు. ఫ్యాక్టర్ ఆధారిత వ్యూహం వల్ల యాక్టివ్, ప్యాసివ్ ఫండ్ నిర్వహణను మిళితం చేయనుంది. ఇలా చేయడం వల్ల మదుపరులు యాక్టివ్‌గా నిర్వహించే ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడులను ఎంచుకునే అవకాశం ఉంది.
ఆ వెంటనే ఈటీఎఫ్ సూచీ ఫండ్లలోనూ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మొత్తం ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా ఉండనుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులపై సమీక్ష చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల పెట్టుబడి దారుడిలో ఎలాంటి ఆందోళన ఉండదు. పెట్టుబడుల్లో ఈక్విటీలకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఫ్యాక్టర్ ఆధారిత ఈటీఎఫ్‌లపై దృష్టి పెట్టాలి. ఈక్రమంలో యాక్టివ్, ప్యాసివ్ పెట్టుబడుల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
Also read:Sukumar Sudden Shock: పుష్ప నటుడికి షాకిచ్చిన సుకుమార్
Also read:నేడే భారత్, జింబాబ్వే తొలి వన్డే.. లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్ డీటెయిల్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి