Mercury Transit 2022 Effect: బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. ఆగస్టు 21న బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలోకి (Mercury Transit In Virgo 2022) ప్రవేశించబోతున్నాడు. అదే సమయంలో గురుడు తన సొంత రాశి అయిన మీనరాశిలో ఉంటాడు. మీన రాశిలోనే బృహస్పతి ఏప్రిల్ 2023 వరకు ఉంటాడు. కన్యా రాశిలోకి బుధుడు ప్రవేశించడం, మీనరాశిలో బృహస్పతి ఉండటం వల్ల సంసప్తక యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశిచక్ర గుర్తులపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు బుధ-గురుల సంసప్తక యోగం 4 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సంసప్తక యోగం ఏ రాశుల వారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
సంసప్తక యోగం ఈ 4 రాశులకు శుభప్రదం
మిథునం (Gemini): బుధుడు, గురుడుల వల్ల ఏర్పడిన సంసప్తక యోగం మిథునరాశివారికి లాభిస్తుంది. వీరి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆఫీసులో ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగుల లైఫ్ బాగుంటుంది.
కర్కాటకం (Cancer): ఇది కర్కాటక రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. జర్నలిజం, రైటింగ్, కౌన్సెలింగ్, నటన, దర్శకత్వం లేదా యాంకరింగ్ వంటి కమ్యూనికేషన్ సంబంధిత పనిలో నిమగ్నమైన వారికి ఈ సంసప్తక యోగం చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ వ్యక్తులు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
సింహం (Leo): సింహ రాశి వారికి బుధ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం వల్ల మీరు ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులు లాభపడతారు. అదృష్టంతో మీ పనులన్నీ పూర్తవుతాయి.
కన్య (Virgo): బుధుడు రాశి మారడం వల్ల ఏర్పడుతున్న సంసప్తక యోగం కన్యారాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. డేటా సైంటిస్ట్, బ్రోకరేజ్, బ్యాంకింగ్, ఔషధం మరియు వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
Also Read: శనిశ్చరి అమావాస్య ఎప్పుడు? శని సడే సతి, ధైయా నుండి బయటపడాలంటే ఏం చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook