BJP Mla Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వేటు పడింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే నెల 2లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు వివాదస్పద కేసులో రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తెలంగాణవ్యాప్తంగా 6 చోట్ల కేసులు నమోదు అయ్యాయి.