Surya-Shukra Conjunction 2022: సింహరాశిలో సూర్య-శుక్ర సంయోగం.. ఆగస్టు 31 నుంచి ఈ రాశులకు డబ్బే డబ్బు!

Surya-Shukra Conjunction 2022: ఆగస్టు 31న సూర్యుడు, శుక్రుడు సింహరాశిలో కలవబోతున్నారు. వీటి ప్రభావం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2022, 07:22 PM IST
Surya-Shukra Conjunction 2022: సింహరాశిలో సూర్య-శుక్ర సంయోగం.. ఆగస్టు 31 నుంచి ఈ రాశులకు డబ్బే డబ్బు!

Surya-Shukra Conjunction 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, శుక్రుడిని రాక్షసుల గురువుగా భావిస్తారు. ప్రేమ, భౌతిక సుఖాలు, విలాసమైన జీవితం, అందానికి కారకుడు శుక్రుడు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి లైఫ్ సూపర్ గా ఉంటుంది. శుక్రుడు మరో వారం రోజుల్లో తన రాశిని మార్చబోతున్నాడు. ఆగస్టు 31న శుక్రుడు సింహరాశిలోకి (Venus Transit in leo 2022) ప్రవేశిస్తాడు. ఇప్పటికే అక్కడ సూర్యుడు ఉన్నాడు. సింహరాశిలో  ఈ రెండు రాశుల కలయిక కొందరికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

వృషభం (Taurus): సింహరాశిలో శుక్రుడు సూర్యుని కలయిక వృషభ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కొత్త జాబ్ రావచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. 

సింహం (Leo): లియోలో శుక్రుడు, సూర్యుని కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం లభిస్తుంది. వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

తుల (Libra): సూర్యుడు, శుక్రుల కలయిక వల్ల తుల రాశి వారు ఆర్థికంగా మెరుగుపడతారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వీరు అనేక మాధ్యమాల ద్వారా డబ్బు పొందుతారు. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.  

Also Read: Venus-Moon Conjunction 2022: మరో 24 గంటల్లో ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News