Venus Transit 2022: ఆగస్టు 31 బుధవారం నాడు శుక్రుడు కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. తుల, వృషభ రాశులకు అధిపతిగా శుక్రుడిని భావిస్తారు. ప్రేమ, శృంగారం, సంపద, ఆనందం, లగ్జరీ లైఫ్ కు కారకుడు శుక్రుడు. సింహరాశిలో శుక్రుడు (Venus Transit in leo 2022) దాదాపు 23 రోజులపాటు ఉండనున్నాడు. లియోలో శుక్రుడి సంచారం కొన్ని రాశులవారి జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశులపై శుక్రుని అశుభ ప్రభావం
మిథునరాశి (Gemini): సింహరాశిలో శుక్రుడు సంచారం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వీరు కెరీర్ పరమైన సమస్యలతోపాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో చీమలకు పిండిని తినిపించడం ద్వారా ప్రయోజనం పొందుతారు.
కర్కాటక రాశి (Cancer): శుక్రుడు ఈ రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం మీ జాతకంలో రెండవ స్థానంలో జరుగుతుంది. ఈ సమయంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గొంతు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినడం మానుకోండి. పూర్వీకుల వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభపడతారు. దీనికి పరిష్కారంగా తెల్లటి ఆహార ధాన్యాలను అవసరమైన వారికి దానం చేయాలి.
కన్య రాశి (Virgo): కన్య రాశి వారు ఈ సమయంలో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఈ కాలంలో మీరు అనవసరమైన ఖర్చులు చేయవలసి ఉంటుంది. కుటుంబ వ్యహారాలలో ఇబ్బందులు రావచ్చు. మీ ప్రేమ జీవితంలో గందరగోళం ఏర్పడవచ్చు. దీనికి పరిహారంగా, కన్య రాశి వారు 'ఓం శుక్రాయై నమః' అనే బీజ మంత్రాన్ని జపించండి. ఇది జీవితంలో సానుకూలతను తెస్తుంది.
మకరరాశి (Capricron); శుక్ర సంచార సమయంలో మీరు అన్ని రంగాలలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీరు ఈ సమయంలో రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. విదేశీ వ్యాపారులు శుభవార్త వినే అవకాశం ఉంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి.
మీన రాశి (Pisces): మీన రాశి వారు కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించండి. వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లడండి. లేదంటే సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో డబ్బు వృథా ఉంటుంది. దీనికి పరిష్కారంగా అన్నం, నెయ్యి, పెరుగు, పంచదార మొదలైన తెల్లని వస్తువులను దానం చేయాలి.
Also Read: 1500 ఏళ్ల తర్వాత ఆగస్టు 25న గురు పుష్య యోగంలో అరుదైన యాదృచ్చికం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook