Astro Remedies: కొబ్బరికాయ మీ అదృష్ట తాళం తెరవగలదు.. ఇలా చేయండి!

Astro tips for Coconut: ఏ పూజ చేసిన, శుభకార్యం మెుదలుపెట్టినా కొబ్బరి కాయ ఉండాల్సిందే. అంత ప్రాముఖ్యత ఉన్న కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీ జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2022, 01:20 PM IST
Astro Remedies: కొబ్బరికాయ మీ అదృష్ట తాళం తెరవగలదు.. ఇలా చేయండి!

Astro Remedy Of Coconut: సనాతన ధర్మంలో కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిని శ్రీఫలం అని కూడా అంటారు. కొబ్బరికాయ (Coconut) కొట్టకుండా ఈ పూజ, శుభకార్యం పూర్తి కావు. ఆస్ట్రాలజీ ప్రకారం, మీ జాతకంలోని గ్రహా దోషాలు, అడ్డంకులను తొలగించడంలో కొబ్బరికాయ అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. కొబ్బరికాయతో ఈ పరిహారాలు చేయడం ద్వారా మీరు సమస్యల నుండి బయటపడవచ్చు. 

కొబ్బరి కాయతో ఈ పరిహారాలు చేయండి
>> మీ లైఫ్ లో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నట్లయితే.. దీనికి పరిహారంగా కొబ్బరికాయను పై నుండి 21 సార్లు తిప్పి దేవాలయంలోని అగ్నిగుండంలో కాల్చండి. ప్రతి మంగళవారం, శనివారం రోజున ఇలా 5 వారాలపాటు చేయండి. 
>> మీరు ఉద్యోగ లేదా వ్యాపారంలో విజయం సాధించాలనుకుంటే, ఇంట్లో కొబ్బరి చెట్టును నాటండి. దీంతో మీ జాతకంలో గురు గ్రహం బలపడుతుంది మరియు మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. త్వరలో మీరు అనుకున్న పని నెరవేరుతుంది. దీంతోపాటు ఇంట్లో ధనం కూడా పెరుగుతుంది.  ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో కొబ్బరి చెట్టును నాటడం ఉత్తమం. 

>> మంగళవారం నాడు కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో కట్టి, వ్యక్తి పై నుండి 7 సార్లు తిప్పి... హనుమంతుని పాదాల వద్ద పెట్టండి.  దీంతో మీపై ఇతరుల చెడు దృష్టి పోతుంది.
>> శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవిని పూజించండి. పూజలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను కొట్టండి. మరుసటి రోజు ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో చుట్టి, బయటి వారికి కనిపించకుండా ఇంట్లోని ఓ ప్రదేశంలో ఉంచండి. ఈ పరిహారంతో మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. 
>> మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీ కెరీర్ లో పురోగతి లేకపోతే... శనివారం నాడు శనిదేవుడి ఆలయానికి వెళ్లి 7 కొబ్బరి కాయలు కొట్టండి. ఆ కొబ్బరి పెచ్చులను తీసి నదిలో ముంచండి. ఇలా చేయడం  వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 

Also Read: Planet Transits 2022: సెప్టెంబరులో 3 గ్రహాల రాశి మార్పు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News